ETV Bharat / sports

ముంబయికి రోహిత్ బైబై!- ఆఖరి మ్యాచ్ ఆడేశాడా?- కోచ్ రెస్పాన్స్​ ఇదే - IPL 2024

Rohit Sharma Last Match For MI: ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆ జట్టుకు లాస్ట్ మ్యాచ్ ఆడేశాడా? ఐపీఎల్​లో రోహిత్ మళ్లీ ముంబయి జెర్సీలో కనిపించడా? దీనిపై ఆ జట్టు కోచ్ ఏమన్నాడంటే?

Rohit Sharma Last Match
Rohit Sharma Last Match (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 11:27 AM IST

Updated : May 18, 2024, 11:48 AM IST

Rohit Sharma Last Match For MI: స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్​ జెర్సీలో ఆఖరి ఐపీఎల్​ మ్యాచ్ ఆడేశాడా? అంటే సోషల్ మీడియాలో నెటిజన్లు ఔననే అంటున్నారు. ఇటీవల కోల్​కతాతో మ్యాచ్​ సందర్భంగా రోహిత్ మాటలే ఈ వార్తలకు బలం చేకుర్చుతున్నాయి. దీంతో ముంబయి తరఫున రోహిత్​కు లఖ్​నవూ మ్యాచ్​ ఆఖరిది అని, వచ్చే సీజన్​లో ఆ జట్టులో ఉండడన్న ప్రచారం సాగుతోంది.

'నాదేముంది భాయ్ ఇదే చివరిది. ఒక్కొక్కటిగా అన్నీ మారిపోతున్నాయి. అదంతా వాళ్ల మీద ఆధారపడి ఉంది. నేను వాటన్నింటినీ పట్టించుకోను. ఏదేమైనప్పటికీ అది నా ఇల్లు భాయ్‌. ఆ దేవాలయాన్ని నేను నిర్మించాను' అని రోహిత్ కేకేఆర్ కోచ్ అభిషేక్‌ నాయర్​తో అన్న మాటలు ఇటీవల వైరలయ్యాయి. కేకేఆర్ తమ అఫీషియల్ అకౌంట్​లో పోస్ట్​ చేసి ఈ వీడియో నిమిషాల్లోనే వైరలైంది. దీంతో వెంటనే కేకేఆర్ అదే రోజు ఈ పోస్ట్​ను డిలీట్ చేసింది.

ఇదే విషయంపై ముంబయి కోచ్ మార్క్ బ్రోచర్ కూడా లఖ్​నవూ మ్యాచ్ తర్వాత స్పందించాడు. 'నేను లాస్ట్​నైట్ రోహిత్​తో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య అతడి కెరీర్ గురించి డీప్ డిస్కషన్స్ ఎమీ జరగలేదు. ఈ సీజన్​లో మా పెర్ఫార్మెన్స్​ గురించి రివ్యూ చేసుకున్నాం. తర్వాత 'నెక్ట్స్ ఏంటి?' అని రోహిత్​ను అడిగా. వెంటనే 'తర్వాత ఏముంది ప్రపంచకప్పే​' అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుత సీజన్​లో మా జట్టు తరఫున అద్భుతంగా ఆడాడు. టాప్ స్కోరర్​గా నిలిచాడు. ఇక వచ్చే సీజన్ వేలం నాటికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?' అని బ్రోచర్ అన్నాడు.

ఇక మ్యాచ్ శుక్రవారం లఖ్​నవూతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు 'రోహిత్', 'రోహిత్' నినాదాలతో స్టేడియం మార్మోగిపోయింది. రోహిత్ సైతం ఈ మ్యాచ్​లో మెరుపు ఇన్నింగ్స్ (68 పరుగులు)​తో అదరగొట్టాడు. అతడికి ముంబయి తరఫున ఇదే లాస్ట్ మ్యాచ్ అని భావించిన ఆడియెన్స్​​ రోహిత్​ ఔటైన తర్వాత నిలబడి చప్పట్లతో గ్రాండ్​గా సెండాఫ్ ఇచ్చారు.

ఈ సీజన్​లో రోహిత్​ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలు హార్దిక్​కు కట్టబెట్టడం హిట్​మ్యాన్స్​కు అస్సలు నచ్చలేదు. దీంతో ముంబయి ఆడిన ప్రతి మ్యాచ్​లో ఫ్యాన్స్​ హార్దిక్​ను ట్రోల్ చేశారు. కాగా, వచ్చే ఎడిషన్​లో ముంబయి రోహిత్​ను రిటైన్ చేసుకుంటుందా? అన్న ప్రశ్నలు మెదులుతున్నాయి. అసలే మెగా వేలం. అందుకే ముంబయి రోహిత్​ను వేలంలో వదిలేస్తుందని, దీంతో వచ్చే ఏడాది నుంచి రోహిత్ ముంబయితో ఉండడన్న వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మెగా వేలం దాకా ఆగాల్సిందే.

రోహిత్ మెరిసినా, లఖ్​నవు మురిసింది- ఓటమితో ముంబయి బైబై! - IPL 2024 LSG VS MI

'కోహ్లీ, రోహిత్​ను తీసుకొని తప్పు చేశారు' - T20 World CUP 2024

Last Updated : May 18, 2024, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.