IPL First Bowler : భారత్‌లో ఐపీఎల్‌కు ఉండే ఆదరణే వేరు. ఈ లీగ్‌లో ఆడేందుకు దేశవిదేశాల్లోని అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం మొగ్గు చూపుతారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులు సైతం విపరీతంగా ఆసక్తి కనబరుస్తారు. కాగా, 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటివరకు 17 సీజన్లు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఈ లీగ్‌కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందుకే ఐపీఎల్ శాటిలైట్ రైట్స్ వంటివి భారీ ధర పలుకుతుండటం మనం చూస్తూనే ఉన్నాయి.
అయితే ఈ లీగ్ తమ టాలెంట్‌ను చూపించుకునేందుకు మంచి వేదికగా కూడా అవుతోంది. ఐపీఎల్లో రాణించేవారికి టీమ్ఇండియా వంటి జట్లు టీ20ల్లో చోటు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్లో మొదటి బాల్ వేసిన బౌలర్ ఎవరు? ఫస్ట్ బాల్ ఆడిన బ్యాటర్ ఎవరు? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్
2008 ఏప్రిల్ 18న ఐపీఎల్ మొదటి సీజన్ ప్రారంభమైంది. అందులో భాగంగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆ మ్యాచ్‌కు వేదికైంది. తొలుత కేకేఆర్ బ్యాటింగ్ చేసింది. అయితే తొలి బంతిని ఆర్ సీబీ బౌలర్ ప్రవీణ్ కుమార్ వేయగా, కేకేఆర్ బ్యాటర్ సౌరభ్ గంగూలీ ఆడాడు. ప్రవీణ్ కుమార్ వేసిన లెంగ్త్ బాల్‌ను గంగూలీ డిఫెన్స్ ఆడాడు. ఇలా ఐపీఎల్లో మొదటి బాల్ వేసిన బౌలర్‌గా ప్రవీణ్, బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా గంగూలీ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో సౌరభ్ గంగూలీ 12 బంతుల్లో కేవలం 10 పరుగులే చేసి వెనుదిరిగాడు.
అయితే ఐపీఎల్ తొలి సీజన్లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు రికార్డు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 3 వికెట్ల నష్టానికి ఏకంగా 222 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రెండన్ మెక్కల్లమ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 73 బంతుల్లో 158 రన్స్ చేశాడు. అందులో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. 223 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆర్సీబీ కేవలం 82 పరుగులకే ఆలౌటైంది. దీంతో కేకేఆర్ 140 రన్స్ తేడాతో గెలిచి, ఐపీఎల్ చరిత్రలో తొలి విజయాన్ని నమోదు చేసింది.
IPL మెగా వేలం: సర్ఫరాజ్‌పై ఆ రెండు ఫ్రాంచైజీల కన్ను- భారీ ధర ఖాయం!