ETV Bharat / sports

'మెక్​కల్లమ్' విధ్వంసానికి 16ఏళ్లు- IPL ప్రారంభమైంది ఈరోజే​ - IPL First Match

IPL First Match: 2008లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 28)న ఐపీఎల్​ ప్రారంభమైంది. తొలి మ్యాచ్​లో కేకేఆర్- ఆర్సీబీ తలపడ్డాయి.

IPL First Match
IPL First Match
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 1:39 PM IST

Updated : Apr 18, 2024, 3:00 PM IST

IPL First Match: క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)​ క్యాష్ రిచ్ లీగ్​గా పేరొందింది. 2008లో సరిగ్గా ఇదే రోజున (ఏప్రిల్ 18) ప్రారంభమైన ఐపీఎల్​ ప్రస్తుతం వరల్డ్​లోనే ఫేమస్ డొమెస్టిక్ లీగ్​గా మారింది. గత 16ఏళ్లుగా క్రికెట్ ప్రేమికులను ఎంటర్టైన్ చేస్తూ, ప్రతీ సీజన్​లో అభిమానులను పెంచుకుంటూ పోతోంది.

ఇక 2008 ఏప్రిల్ 18న కోల్​కతా నైట్​రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు​ మధ్య పోరుతో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్​కు తెర లేచింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్​కతా 20ఓవర్లలో 222 పరగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కివీస్ బ్యాటర్ బ్రెండన్ మెక్​కల్లమ్ ఈ మ్యాచ్​లో విధ్వంసం సృష్టించాడు. 73 బంతుల్లో ఏకంగా 158 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఆర్సీబీ ఛేదనలో 82 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్​ హిస్టరీలోనే కేకేఆర్ తొలి విజయం అందుకున్న జట్టుగా నిలిచింది.

ఇక తొలి ఏడాది నుంచి ప్రతీ సీజన్​కు ఐపీఎల్​పై ఆదరణ పెరిగింది. ఎందరో యువ క్రికెటర్ల ప్రతిభను ఐపీఎల్​ ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అనేక మంది క్రికెటర్లు ఐపీఎల్​లో ఆడారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్లేయర్లు టీమ్ఇండియాలో సైతం ఎంట్రీ ఇచ్చారు. ఇక 2013 సీజన్​లో స్పాట్ ఫిక్సింగ్ అంశం కాస్త ఆందోళన కలిగించినా ఈ ప్రభావం టోర్నీపై పడలేదు. ఇక 2015 తర్వాత రెండు సీజన్​ (2016, 2017)లు పలు కారణాల వల్ల చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలు నిషేధం ఎదుర్కొన్నాయి.

ఐపీఎల్​లో జట్లు: తొలుత ఐపీఎల్ 8 జట్లతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత అయా సీజన్​లలో ఒకట్రెండు కొత్త జట్లు వచ్చి వెళ్లాయి. అలా కొచ్చి టస్కస్ కేరళ (2011), పుణె వారియర్స్ ఇండియా (2011, 2012), రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ (2016, 2017), గుజరాత్ లయన్స్ (2016, 2017) వచ్చి వెళ్లాయి. ఇక 2022 నుంచి లఖ్​నవూ, గుజరాత్ కొత్తగా చేరాయి.

ఏడాది విజేత

  • 2008- రాజస్థాన్
  • 2009- డెక్కన్ ఛార్జర్స్
  • 2010- చెన్నై సూపర్ కింగ్స్
  • 2011- చెన్నై సూపర్ కింగ్స్
  • 2012- కోల్​కతా నైట్​రైడర్స్
  • 2013- ముంబయి ఇండియన్స్
  • 2014- కోల్​కతా నైట్​రైడర్స్
  • 2015- ముంబయి ఇండియన్స్
  • 2016- సన్​రైజర్స్​ హైదరాబాద్
  • 2017- ముంబయి ఇండియన్స్
  • 2018- చెన్నై సూపర్ కింగ్స్
  • 2019- ముంబయి ఇండియన్స్
  • 2020- ముంబయి ఇండియన్స్
  • 2021- చెన్నై సూపర్ కింగ్స్
  • 2022- గుజరాత్ జెయింట్స్
  • 2023- చెన్నై సూపర్ కింగ్స్

Last Updated : Apr 18, 2024, 3:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.