IPL 2025 Match Count : భారత్‌లో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఈ డొమెస్టిక్ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే 2025 ఐపీఎల్ గురించి ఈ మధ్య రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా వేలంపై బీసీసీఐ రూల్స్ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా 2025 ఐపీఎల్ టోర్నమెంట్లో ఎన్ని మ్యాచ్‌లు ఉంటాయనే దానిపై అప్డేట్ వచ్చింది.
ఈ సారి కూడా 74 మ్యాచ్ లే!
2023 - 27 ఐపీఎల్ సీజన్ వరకు బీసీసీఐ మీడియా హక్కులను విక్రయించింది. ఈ క్రమంలో 2023, 2024లో ఒక్కొ సీజన్లో 74 మ్యాచ్‌లు, 2025, 2026లో 84 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు గతంలో వెల్లడించింది. 2027లో ఏకంగా 94 మ్యాచ్ ఆడించనున్నట్లు తెలిపింది. కానీ, వచ్చే ఏడాది అంటే 2025 ఐపీఎల్ లో 84 మ్యాచ్ లకు బదులు 74 మ్యాచ్‌లే ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఎందుకంటే?
అయితే వచ్చే ఏడాది జూన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీలో భారత్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చేందుకే ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాచ్‌లు పెంచకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2023, 2024 ఐపీఎల్ మాదిరిగా ఈసారి కూడా 74 మ్యాచ్‌లు ఉంటాయని సమాచారం. ఈ అప్డేట్ ఐపీఎల్ అభిమానులను నిరాశపరిచినా, ఆటగాళ్లకు మాత్రం ఊరటనిచ్చే విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు కొంత సమయం దొరుకుతుంది.
జైషా కీలక వ్యాఖ్యలు!
గతంలో 2025 ఐపీఎల్ సీజన్ మ్యాచ్ లపై బీసీసీఐ సెక్రటరీ జైషా మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఐపీఎల్ 2025 సీజన్లో 84 మ్యాచ్‌లు నిర్వహించాలని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఎక్కువ మ్యాచ్‌ల కారణంగా ఆటగాళ్లపై భారం పడుతుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో 84 మ్యాచ్‌లు నిర్వహించాలని కాంట్రాక్ట్‌లో భాగమే. అయితే 74 లేదా 84 మ్యాచ్‌లు నిర్వహించాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయిస్తుంది' అని జైషా వ్యాఖ్యానించారు.
NO INCREASE IN IPL MATCHES.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2024
- The BCCI has decided to continue with 74 matches for IPL 2025 instead of 84 due to players' workload management. (Espncricinfo). pic.twitter.com/SRoVr85eFX
కేకేఆర్‌కు కొత్త మెంటార్ - గంభీర్ స్థానంలో ఎవరొచ్చారంటే? - IPL 2025 KKR MENTOR
నో RTM కార్డ్- 5గురు ప్లేయర్ల రిటెన్షన్- మెగా వేలం కొత్త రూల్స్ ఇవే! - IPL 2025 Auction Rules