IPL 2024 KKR Rahul Dravid Mentor Role : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. త్వరలోనే కొత్త కోచ్ రానున్నాడు. దీంతో ద్రవిడ్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయని తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే అతడిని ఎలాగైనా దక్కించుకోవాలని కొన్ని ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ద్రవిడ్ వ్యూహాలను రచిచండంతో పాటు ప్లేయర్స్‌ను మానసికంగానూ సన్నద్ధం చేయడంలో దిట్ట. అతడి కోచింగ్‌లో ప్లేయర్స్ మరింత రాటుదేలుతారు. టీమ్ఇండియా కూడా ఎన్నో ఘనతలు సాధించిన సంగతి తెలిసిందే. 2022 టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్‌కు వెళ్లిన భారత జట్టు, 2023 వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరింది. ఇక రీసెంట్గా జరిగిన 2024 టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచి అద్భుతం సృష్టించింది. ఈ విజయంలో ద్రవిడ్‌ది ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని కోహ్లీ, రోహిత్ కూడా చెప్పారు.
అందుకే ఇప్పుడు ద్రవిడ్ టీమ్ఇండియా కోచ్ పదవికి గుడ్‌బై చెప్పడంతో అతడిపై ఐపీఎల్ ప్రాంఛైజీలు కన్నేశాయి. అతడి కోసం విపరీతంగా పోటీ పడుతున్నట్లు తెలిసింది. కోచ్‌గా లేదా మెంటార్‌గా జట్టులోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. అయితే ద్రవిడ్ కోసం అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందుగా కోల్‌కతా నైట్ రైడర్స్(KKR Mentor Role) సంప్రదించిందని ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. కోచ్‌గా కాకుండా మెంటార్‌గా బాధ్యతలు తీసుకోవాలని ద్రవిడ్‌ను కేకేఆర్ కోరిందని సమాచారం అందింది. దీని కోసం రాహుల్ ద్రవిడ్‌కు బ్లాంక్ చెక్ కూడా ఆఫర్ చేసిందని కథనాల్లో రాసి ఉంది.
IPL 2024 Title Winner KKR : పైగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దం తర్వాత ఛాంపియన్‌గా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో సీజన్ ఆద్యంతం అదరగొట్టిన ఈ జట్టుకు మెంటార్‌గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. అతడు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే ఇప్పుడతడు మరికొన్ని రోజుల్లో టీమ్ఇండియా కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. అందుకే గంభీర్ కేకేఆర్ మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో గంభీర్ స్థానంలో ద్రవిడ్‌ను తీసుకోవాలని కేకేఆర్ ఫ్రాంచైజీ ఆశిస్తోంది.
నేను నిరుద్యోగిని - జాబ్ ఆఫర్లు ఉంటే చెప్పండి - ద్రవిడ్ రిక్వెస్ట్! - Rahul Dravid Job search