SRH Kavya Maran Luxury cars : సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ తారలు, క్రికెటర్లు, పొలిటీషియన్స్ అందరి లైఫ్ ఎంతో విలాసవంతంగా ఉంటుంది. అయితే వీరిలో చాలా మంది లగ్జరీ కార్లంటే చాలా ఇష్టపడతారు. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లను కొనుగోలు చేసి తమ గ్యారేజ్‌లో పెట్టుకుంటుంటారు. అలానే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్‌కు కూడా ఈ విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసే అలవాటు ఉందట. తాజాగా ఆమె దగ్గర ఉన్న విలువైన కార్ల వివరాలు తెలిశాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ నుంచి ఫెరారీ వరకు అధునాతన, అత్యంత ఖరీదైన కార్లు ఈ ముద్దుగుమ్మ దగ్గర ఉన్నాయట.
రోల్స్ రాయల్స్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యూబీ - ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్లలో రోల్స్ రాయ్స్ ఒకటి. రోల్స్ రాయ్స్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యూబీ మోడల్ కారు కావ్య దగ్గర ఉందట. దీని విలువ దాదాపు రూ.12.2 కోట్ల వరకు ఉంటుంది.
బెంట్లీ బెంటేగా ఈడబ్ల్యూబీ - బెంట్లీకి చెందిన బెంటేగా ఈడబ్ల్యూబీ కారు కూడా కావ్య పాప గ్యారేజ్‌లో ఉందని తెలిసింది. ఈ కారు ధర రూ.6 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. కావ్య దగ్గర రెడ్ కలర్ బెంట్లీ కారు ఉందట.
ఫెరారీ రోమా - ఇటలీకి చెందిన ఫెరారీ రోమా మోడల్ కారు కూడా కావ్య మారన్ గ్యారేజ్‌లో ఉంది. దీని విలువ రూ.3.76 కోట్ల నుంచి ప్రారంభం. ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చొగలరు.
బీఎండబ్ల్యూ ఐ7 - కావ్య మారన్ దగ్గర లగ్జరీ ఎలక్ట్రిక్ కారు బీఎండబ్ల్యూ ఐ7(బ్లాక్ సఫైర్ మెటాలిక్ షేడ్) కూడా ఉందని తెలిసింది. దీని ధర రూ.2.13 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది.
కాగా సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ - కావేరి మారన్ దంపతుల కుమార్తె కావ్య మారన్. 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించింది. చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ, యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందింది. ప్రస్తుతం సన్ టీవీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. అలానే ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బాధ్యతలను చూసుకుంటోంది.
సన్‌రైజర్స్ ఆ'రేంజ్' మారింది- సక్సెస్ వెనకాల 'ఒక్కడు'- చెప్పిమరి చేస్తున్నాడుగా! - IPL 2024
కమిన్స్ నోట తెలుగు మాట - స్టార్ హీరోల డైలాగ్స్ చెప్పి అదరగొడుతున్న స్టార్ క్రికెటర్ - IPL 2024