IPL 2024 SRH VS RCB Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో ఏప్రిల్ 25న గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన మూడో ఆటగాడిగా నిలిచాడు. లిస్టులో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్‌తో సమానంగా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్ బౌలింగ్‌లో కొట్టిన సిక్సుతో కోహ్లి 251 సిక్సుల మైల్‌స్టోన్ అందుకున్నాడు. మొత్తంగా 246 మ్యాచ్‌లలో 251 సిక్సర్లు బాదాడు. డిలివిలయర్స్ ఇప్పటివరకు 184 మ్యాచ్‌లలో 251 సిక్సులు కొట్టాడు.
కాగా, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు (357) కొట్టిన బ్యాటర్‌ల జాబితాలో వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండో స్థానంలో ఇండియన్ కెప్టెన్, ముంబయి ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ(275) కొనసాగుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ(247) సిక్సర్లు కొట్టి ఐదో స్థానంలో ఉన్నాడు.
- అద్భుతమైన ఫామ్‌లో కోహ్లీ
ఈ సీజన్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 9 మ్యాచ్‌లలో 430 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలోనూ 400 పైగా పరుగులు చేసిన చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 2024లో 400 రన్స్‌ను క్రాస్ చేసిన విరాట్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
-
We were gunning for a partnership like this one and they fired on all cylinders. 🙌#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #SRHvRCB pic.twitter.com/CouexrgNVj
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 25, 2024
- అదరగొట్టిన ఆర్సీబీ
ఏప్రిల్ 25న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 206-7 భారీ స్కోరు సాధించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్‌లు, 1 సిక్స్ ఉన్నాయి. రజత్ పటిదార్ కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. గ్రీన్ కూడా 20 బంతుల్లో 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో రాయల్ ఛాలెంజర్స్ 206 పరుగులు సాధించింది. సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఆర్సీబీ ఒక్క గేమ్‌లో గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో అయినా ఆర్సీబీ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సన్‌రైజర్స్ బౌలర్‌లలో జయదేవ్ ఉనద్కత్ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్ 4 ఓవర్లలలో 39 పరుగులు సమర్పించుకుని 2 వికెట్లు తీసుకున్నాడు.
ధావన్ ఎప్పుడు తిరిగొస్తాడంటే? - IPL 2024
వీళ్లమధ్యే తీవ్ర పోటీ - ఎవరికి చోటు దక్కేనో? - T20 Worldcup 2024