ETV Bharat / sports

హైదరాబాద్‌ ఓపెనర్ల విధ్వంసం - ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌ - IPL 2024 - IPL 2024

IPL 2024 Highest score in power play : దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. దిల్లీ బౌలింగ్‌ను ఊచకోత కోశారు. దీంతో ఏడేళ్ల క్రితం బెంగళూరుపై కోల్‌కతా చేసిన 105 పరుగుల రికార్డు తాజాగా బద్దలైంది.

హైదరాబాద్‌ ఓపెనర్ల విధ్వంసం - ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 8:40 PM IST

Updated : Apr 20, 2024, 9:55 PM IST

IPL 2024 Highest score in power play : దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ పవర్‌ ప్లే ముగిసే సరికి హైదరాబాద్‌ వికెట్‌ కోల్పోకుండా 125 పరుగులు చేసింది. అభిషేక్‌ (40*;10 బంతుల్లో 2×4, 5×6), హెడ్‌ (84*; 26 బంతుల్లో 11×4, 6×6) బాాదారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి రెచ్చిపోయింది. ఈ లీగ్‌లో మూడో సారి 250కి పైగా పరుగులు చేసింది. ఈ రోజు దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 266-7 పరుగులు సాధించింది. ట్రావిస్‌ హెడ్‌(89), అభిషేక్‌ శర్మ(46), షాబాజ్‌ అహ్మద్‌(59), నితీష్‌ రెడ్డీ(37) రాణించడంతో సన్‌రైజర్స్‌ భారీ స్కోరు సాధించింది.

  • పవర్‌ ప్లే రికార్డ్

ఇప్పటి వరకు విశాఖపట్నం హోమ్‌ గ్రౌండ్‌గా దిల్లీ మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. లీగ్‌లో మొదటిసారి దిల్లీ వేదికగా బరిలోకి దిగింది. టాస్‌ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్‌ (84*; 26 బంతుల్లో 11×4, 6×6), అభిషేక్‌ శర్ (40*;10 బంతుల్లో 2×4, 5×6) ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. దిల్లీ బౌలింగ్‌ను ఊచకోత కోశారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. హెడ్‌ 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదేశాడు. అభిషేక్‌ కూడా సిక్సులతో రెచ్చిపోవడంతో, సన్‌రైజర్స్‌ తన పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బద్ధలు కొట్టేలా కనిపించింది.

అలా పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులతో రికార్డు సృష్టించింది. ఐపీఎల్‌లో మాత్రమే కాదు టీ20 క్రికెట్‌ హిస్టరీలనే పవర్‌ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. దీంతో ఏడేళ్ల క్రితం బెంగళూరుపై కోల్‌కతా చేసిన 105 పరుగుల రికార్డు తాజాగా బద్దలైంది.

  • సన్‌రైజర్స్‌కి బ్రేక్‌ వేసిన కుల్దీప్‌
    జోరు మీదున్న అభిషేక్‌ శర్మ(12 బంతుల్లో 46)ని ఏడో ఓవర్లో కుల్దీప్‌ ఔట్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్‌క్రమ్‌(1)ని కూడా కుల్దీప్‌ ఎక్కువ సేపు నిలువనీయలేదు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ స్కోరు బోర్డు నెమ్మదించింది. కొంత సేపటికే సూపర్‌ ఫామ్‌లో ఉన్న హెడ్‌ని కూడా కుల్దీప్‌ అవుట్‌ చేసి షాక్‌ ఇచ్చాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న హెడ్‌(32 బంతుల్లో 89) ట్రిస్టన్‌ స్టబ్స్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రికార్డు స్కోరు సాధించేలా కనిపించిన సన్‌రైజర్స్‌ని కీలక మూడు వికెట్లు తీసి కుల్దీప్‌ అడ్డుకున్నాడు. అనంతరం ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ని అక్షర్‌ పటేల్ బౌల్డ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ నెమ్మదించింది.
  • నితీష్‌, షాబాజ్‌ పార్ట్‌నర్‌షిప్‌
    సన్‌రైజర్స్‌ కీలక 4 వికెట్లు కోల్పోయినా దిల్లీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 9.1 ఓవర్లకే 154 పరుగులు సాధించింది. అనంతరం నితీష్ రెడ్డీ, షాబాజ్‌ అహ్మద్‌ ఆచితూచి ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్‌రేట్‌ తగ్గకుండా చూశారు. నితీష్ 27 బంతుల్లో 37 పరుగులతో రాణించాడు. నితీష్‌ని కూడా కుల్దీప్‌ అవుట్‌ చేశాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించిన షాబాజ్‌ డెత్‌ ఓవర్లలో ఎదురు దాడిగి దిగాడు. 29 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నితీస్, షాబాజ్‌ పార్ట్‌నర్‌షిప్‌తో సన్‌రైజర్స్‌ 266 పరుగులు చేసింది.
  • దిల్లీ బౌలర్లకు పీడకల

ఇన్నింగ్స్‌ ప్రారంభంలో వచ్చిన బౌలర్లను వచ్చినట్లు హెడ్‌, అభిషేక్‌ ఉతికేశారు. అందరికీ బౌండరీలతో వెల్‌కమ్‌ చెప్పారు. అక్షర్‌ మినహా అందరూ దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కుల్దీప్‌ నాలుగు ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో లేని రూల్‌ ఐపీఎల్​లో ఎందుకు? - IPL 2024

హోమ్​ గ్రౌండ్​లో అదుర్స్​- ఇతర పిచ్​లపై బెదుర్స్​- చెన్నై పరిస్థితి ఎందుకిలా? - IPL 2024 CSK

Last Updated : Apr 20, 2024, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.