ETV Bharat / sports

'ఒత్తిడిగా అనిపిస్తోంది' - IPL కమ్​బ్యాక్​పై పంత్ టెన్షన్​! - IPL 2024 Rishab pant comeback

IPL 2024 Rishab Pant : ఫిట్​నెస్ సాధించి ఐపీఎల్​ 2024 కోసం పునరాగమనం చేయబోతుండటంపై స్పందించాడు దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్ పంత్. ఏం అన్నాడంటే?

'ఒత్తిడిగా అనిపిస్తోంది' - IPL కమ్​బ్యాక్​పై పంత్ టెన్షన్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 2:46 PM IST

Updated : Mar 13, 2024, 3:26 PM IST

IPL 2024 Rishab Pant: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత సుదీర్ఘ కాలం విరామంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడతడు దాదాపు 14నెలల విరామం తర్వాత ఐపీఎల్ 2024 కోసం పునరాగమనం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ ప్రకటన తర్వాత పంత్ కూడా తన కమ్​బ్యాక్​పై స్పందించాడు. ఓ వైపు ఎక్సైటింగ్​గా ఫీలవుతూనే కాస్త నెర్వస్​గా కూడా అవుతున్నట్లు పంత్ పేర్కొన్నాడు.

"నేను చాలా ఉత్సాహంగా అలాగే కాస్త ఆందోళనగా కూడా ఉన్నాను. మళ్లీ నా తొలి మ్యాచ్ ఆడబోతున్నానన్న ఫీలింగ్ కలుగుతోంది. ప్రమాదం తర్వాత మళ్లీ ఇప్పుడు క్రికెట్ ఆడటం అనేది ఓ అద్భుతమనే చెప్పాలి. నా శ్రేయోభిలాషులు, అభిమానులు, బీసీసీఐ, ఎన్సీఏ సిబ్బందికి కృతజ్ఞతలు. వాళ్ల ప్రేమాభిమానాలు, మద్దతు నాకు బలాన్నిస్తూనే ఉన్నాయి" అని పంత్ చెప్పుకొచ్చాడు.

"నేను దిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్​కు తిరిగి వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా టీమ్ ఓనర్లు, సపోర్ట్ స్టాఫ్ ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచారు. వాళ్లకు నేను రుణపడి ఉంటాను. దిల్లీ ఫ్యామిలీతో మళ్లీ కలిసి అభిమానుల ముందు ఆడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ రాణిస్తే వరల్డ్ కప్​లోకి: ఈ ఐపీఎల్​ పంత్​కు ఓ పరీక్ష లాంటిదనే చెప్పాలి. ఈ మెగా లీగ్​లో అతడు బాగా రాణిస్తే టీ20 వరల్డ్ కప్​ టీమ్​లోకి అతడు వచ్చే అవకాశాలు ఉంటాయి. అతడు ఇప్పటి వరకు కెరీర్​లో టీమ్​ఇండియా తరఫున 33 టెస్టులు, 30 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. అయితే 2022 డిసెంబర్​ చివర్లో అతడి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తృటిలో ప్రాణాలతో బయటపడ్డ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు మూడు సర్జరీలు జరిగాయి. అయినప్పటికీ గాయాల నుంచి త్వరగానే కోలుకుని 14 నెలల తర్వాత మళ్లీ ఐపీఎల్​లో అడుగుపెట్టబోతున్నాడు.

IPL 2024 గెట్‌ రెడీ ఆరెంజ్‌ ఆర్మీ - హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే?

IPL 2024 లఖ్​నవూ - ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తదా?

Last Updated : Mar 13, 2024, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.