IPL 2024 Rohith Sharma : ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తాజా మ్యాచులో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ముంబయి నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించే సమయంలో ఓ వ్యక్తి సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మవైపు పరుగెత్తుకొచ్చాడు. దీనిని సడెన్‌గా గమనించిన హిట్ మ్యాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత సదరు వ్యక్తిని కౌగిలించుకుని గ్రౌండ్‌లో నుంచి బయటికి వెళ్లాలని సూచించాడు.ఇకపోతే హిట్ మ్యాన్‌ను కౌగిలించుకున్న ఆ వ్యక్తి ఆ తర్వాత పక్కనే ఉన్న ఇషాన్ కిషన్‌తోనూ కరచాలనం చేసి అభిమానంతో హగ్ ఇచ్చాడు. ఈ సమయంలోనే సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు.
పాండ్యకు అండగా రోహిత్(Hardik Panyda Rohith Sharma) - రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య నియమితుడైనప్పటి నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. మ్యాచులో కోసం వెళ్లిన ప్రతి సారి స్టేడియంలో ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తోంది. తాజాగా హోం గ్రౌండ్ వాంఖడేలోనూ అది మరింత ఎక్కువైంది. ఆ హేళన మరింత ఎక్కువ అవ్వడంతో ఆ సమయంలో పాండ్యకు మాజీ కెప్టెన్ రోహిత్ అండగా నిలవడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ అభిమానులు వీటిని తెగ ఫార్వాడ్ చేస్తున్నారు.
ఫాస్టెస్ట్ డెలివరీ(IPL 2024 Fastest Delivery) - ఇకపోతే ఈ మ్యాచ్‌లో ముంబయి పేస్ గన్ గెరాల్డ్ కొయెట్జీ 2024 ఐపీఎల్ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. రియాన్ పరాగ్ ఎదుర్కొన్న లాస్ట్ బాల్‌ను రికార్డు స్థాయిలో 157.4 కిమీ వేగంతో సంధించాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. అంతకుముందు రెండు రోజుల ముందు లఖ్‌నవూ పేసర్ మయాంక్ యాదవ్ తన డెబ్యూ మ్యాచ్‌లోనే 155.8 కిమీ వేగంతో బంతిని వేశాడు. అలా వరుసగా రెండు అత్యంత వేగవంతమైన డెలీవరీలు నమోదయ్యాయి.
రాజస్థాన్‌తో మ్యాచ్ - ఓడినప్పటికీ ఓ అరుదైన ఘనత సాధించిన ముంబయి - IPL 2024 Mumbai Indians
'చాలా బాధగా ఉంది - అలా చేసి ఉంటే మరోలా ఉండేది' - Hardik Pandya IPL 2024