ETV Bharat / sports

మొదటి క్వాలిఫయర్​ మ్యాచ్​లో హైదరాబాద్​కు నిరాశ- ఫైనల్​కు చేరిన కోల్​కతా - IPL 2024 Qualifier 1 - IPL 2024 QUALIFIER 1

IPL 2024 Qualifier 1 : ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక క్వాలిఫయర్ -1 మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై కోల్​కతా నైట్​ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్​ 2024 ఫైనల్​కు దూసుకెళ్లింది.

IPL 2024 Qualifier 1
IPL 2024 Qualifier 1 (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 10:46 PM IST

Updated : May 21, 2024, 10:52 PM IST

IPL 2024 Qualifier 1: ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక క్వాలిఫయర్ -1 మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై కోల్​కతా నైట్​ రైడర్స్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్​ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 13.4 ఓవర్లలోనే ఛేదించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. వెంకటేశ్‌ అయ్యర్ (51*) శ్రేయస్ అయ్యర్ (58*) మెరుపు అర్ధ శతకాలు బాది జట్టుకు ఘన విజయం అందించారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 159 పరుగులు మాత్రమే చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి (35) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌(21) కమ్మిన్స్‌(24) మంచి స్కోర్ సాధించారు. ఇక కోల్​కతా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు తీయగా వరుణ్‌ చక్రవర్తి రెండు, రస్సెల్‌, నరైన్‌, హర్షిత్‌ రనా, ఆరోరా తలో వికెట్‌ తీశారు.

ఇదిలా ఉండగా, ఐపీఎల్‌లో ఫైనల్‌కు వెళ్లడం కోల్‌కతాకు ఇది నాలుగోసారి. 2012లో గంభీర్‌ సారథ్యంలో తొలిసారి తుదిపోరుకు చేరిన కేకేఆర్‌, ఆ తర్వాత 2014లోనూ ఫైనల్స్​కు చేరుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ జట్టు కప్‌ కైవసం చేసుకుంది. అయితే చివరిగా 2021లోనూ తుదిపోరుకు చేరినప్పటికీ చెన్నై చేతిలో ఓటమిని చవిచూసింది. 2022, 23 టోర్నీల్లో ఆ జట్టు ఏడో స్థానంలో నిలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.
ఇంపాక్ట్​ సబ్​స్టిట్యూట్స్ : అనుకుల్ రాయ్, మనీశ్​ పాండే, నితీష్ రాణా, కేఎస్​ భరత్, షెర్ఫైన్ రూథర్‌ఫోర్డ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు : పాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, టి నటరాజన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్.
ఇంపాక్ట్​ సబ్​స్టిట్యూట్స్ : సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, జయదేవ్ ఉనద్కత్.

'ఆ మాట చాలా క్రేజీగా ఉంది - ధోనీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు' - IPL 2024

'ఆ మూడింటి కోసమే ఎదురుచూస్తున్నా' - IPL 2024 Shreyas Iyer

Last Updated : May 21, 2024, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.