ETV Bharat / sports

సన్​రైజర్స్ x కేకేఆర్- ఆర్సీబీ x రాజస్థాన్ : ప్లేఆఫ్స్​లో ఎవరిది పైచేయి? - IPL 2024

IPL 2024 Playoffs: 2024 ఐపీఎల్​ లీగ్ దశ ముగిసింది. ఇక కేకేఆర్, సన్​రైజర్స్, రాజస్థాన్, ఆర్సీబీ ప్లేఆఫ్స్​కు రెడీ అవుతున్నాయి. ఈ మ్యాచ్​లు ఎప్పుడు, ఎక్కడ జరగనున్నాయంటే?

IPL 2024 Playoffs
IPL 2024 Playoffs (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 7:03 AM IST

Updated : May 20, 2024, 7:08 AM IST

IPL 2024 Playoffs: 2024 ఐపీఎల్​ లీగ్ దశ ముగిసింది. టాప్-4 జట్లు ప్లేఆఫ్స్​కు సిద్ధమవుతున్నాయి. లీగ్ దశలో అత్యధిక విజయాలు (9) సాధించిన కోల్​కతా నైట్​రైడర్స్​ టాప్​లో ఉండగా, సన్​రైజర్స్ (8 విజయాలు), రాజస్థాన్ రాయల్స్ (8 విజయాలు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7 విజయాలు) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నాయి.

టాప్​- 2లో ఉన్న కేకేఆర్- సన్​రైజర్స్​ క్వాలిఫయర్ 1లో పోటీ పడనున్నాయి. ఇందులో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్​కు అర్హత సాధిస్తుంది. ఓడిన టీమ్ క్వాలిఫయర్- 2కు వెళ్తుంది. ఇక రాజస్థాన్- బెంగళూరు జట్లు ఎలిమినేటర్​లో తలపడనున్నాయి. ఇందులో విజయం సాధించిన టీమ్ క్వాలిఫయర్- 2కు వెళ్లగా, ఓడిన జట్టు ఇంటి బాట పట్టనుంది.

క్వాలిఫయర్-1: అహ్మదాబాద్ వేదికగా మంగళవారం (మే 21) ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న టాప్ 2 జట్ల మధ్య జరగనున్న పోరు మరింత ఆసక్తి రేపుతోంది. లీగ్ మ్యాచ్​ల్లో సన్​రైజన్స్​ను ఓడించిన కేకేఆర్ క్వాలిఫయర్​లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇటు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న సన్​రైజర్స్​ను ఓడించడం కూడా అంత సులువేం కాదు. చూడాలి మరి ఈ పోటీలో నెగ్గి ముందుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకునేదెవరో?

ఎలిమినేటర్: బుధవారం (మే 22)న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఎలిమినేటర్ మ్యాచ్​ జరగనుంది. ఈ ఎలిమినేటర్​లో తలపడనున్న రెండు జట్లు లీగ్​ను పూర్తి భిన్నంగా ఆరంభించాయి. వరుస విజయాలతో రాజస్థాన్ లీగ్​ను ప్రారంభించగా, వరుస ఓటములతో ఆర్సీబీ టోర్నీ ఫస్ట్ హాఫ్​లో సతమతమైంది. ఒక దశలో టోర్నీ నుంచి నిష్క్రమించే స్థాయికి వెళ్లిన ఆర్సీబీ తర్వాత పుంజుకొని టాప్- 4లోకి దూసుకురావడం ఆ జట్టు ఫామ్​ను గుర్తుచేస్తుంది.

ఓవైపు రాజస్థాన్ లీగ్​ దశను పేలవంగానే ముగించిందని చెప్పవచ్చు. రాజస్థాన్ చివరి 5 మ్యాచ్​ల్లో నాలుగింట్లో ఓడగా, ఒకటి రద్దైంది. అంటే చివరి 5 మ్యాచ్​ల్లో ఒక్క విజయం కూడా లేదు. అటు అర్సీబీ మాత్రం చివరగా ఆడిన 6 మ్యాచ్​ల్లో అన్నింట్లోనూ నెగ్గి ఊపు మీద ఉంది. కానీ, నాకౌట్ దశలో రాజస్థాన్​ను తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టు ఎప్పుడైనా పుంజుకోవచ్చు. అందుకే ఈ పోటీ కూడా అంత ఈజీగా ఏమి ఉండదు. ఇంత కష్టపడి ఇక్కడిదాకా వచ్చిన ఆర్సీబీ మరో అడుగు ముందుకు వేస్తుందా? లేదా రాజస్థాన్ పుంజుకొని ఆర్సీబీని దెబ్బ కొడుతుందా? చూడాలి.

పంజాబ్​కు నిరాశే - 4 వికెట్ల తేడాతో సన్​రైజర్స్ విక్టరీ - IPL 2024

రాజస్థాన్ వర్సెస్​ కోల్​కతా - వరుణుడి అంతరాయం వల్ల మ్యాచ్ రద్దు - IPL 2024

Last Updated : May 20, 2024, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.