IPL 2024 Play Offs : ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్స్‌కు వేళైన సంగతి తెలిసిందే. మరి కొన్ని గంటల్లో క్వాలిఫయర్ - 1 మ్యాచ్ కూడా జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. అయితే ఇక్కడ విశేషమేమిటంటే ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లలో ఒక కామన్ పాయింట్ దాగి ఉంది. అదేంటంటే 'R'. హా అవును మీరు చదివింది నిజమే. పూర్తి పేర్లు చదివితే అలా అనిపించదు కానీ వాటి షార్ట్ కట్ పేర్లను చూస్తే ఇది అర్థమవుతుంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), మూడు నాలుగు స్థానాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్(RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఇలా నాలుగు జట్లలోనూ 'R' అనే అక్షరం కామన్‌గా కనిపిస్తుంది. ఇక తెలుగులోనూ చూస్తే ఆర్ అనే అక్షరం కచ్చితంగా కనిపిస్తుంది. పైగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. అలా మరో R (Rain) కూడా ఈ మ్యాచులలో పాల్గొనడానికి, అదే ఆటంకం కలిగించడానికి సిద్ధంగా ఉంది. అందుకే వర్షం పడితే ఏమవుతుందో అనే టెన్షన్ కూడా అభిమానుల్లో ఎక్కువగా ఉంది. దీంతో 2024 ఐపీఎల్ ప్లేఆఫ్స్ Rతో నిండిపోయిందని క్రికెట్ ప్రియులు, నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తూ ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.
ప్లేఆఫ్స్ షెడ్యూల్ వివరాలు
మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కోల్‌కతా - హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా నేడు(మే 21) రాత్రి 7.30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ - ఆర్సీబీ మే 22న పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధిస్తుంది. మే 24న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో పోటీపడనుంది. ఇక మే 26న చెన్నై వేదికగా తుది పోరు జరగనుంది.
కోల్‌కతా వర్సెస్ సన్‌రైజర్స్ - క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పరుగుల వీరులు వీరే! - IPL 2024