ETV Bharat / sports

ప్లే ఆఫ్స్​ షెడ్యూల్ ఇదే - లీగ్ స్టేజ్​లో ఈ 4 జట్ల ప్రదర్శన ఎలా సాగిందంటే? - IPL 2024 Play offs - IPL 2024 PLAY OFFS

IPL 2024 Play Offs : దాదాపు రెండు నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నాలుగు జట్లు నాకౌట్‌ దశకు చేరుకోవడంతో ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు వేళైంది. రెండు జట్లు కాస్త ఈజీగానే బెర్త్​లు కన్ఫామ్ చేసుకున్నా మరో రెండు మాత్రం సంచలన ప్రదర్శనతో మిగతా రెండు స్థానాలను దక్కించుకున్నాయి. మరి ఈ రెండు నెలల పాటు ఎవరి ప్రయాణం ఎలా కొనసాగిందో చూద్దాం.

Source The Associated Press
IPL 2024 Play offs (Source The Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 4:51 PM IST

IPL 2024 Play Offs : దాదాపు రెండు నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నాలుగు జట్లు నాకౌట్‌ దశకు చేరుకోవడంతో ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు వేళైంది. రెండు జట్లు కాస్త ఈజీగానే బెర్త్​లు కన్ఫామ్ చేసుకున్నా మరో రెండు మాత్రం సంచలన ప్రదర్శనతో మిగతా రెండు స్థానాలను దక్కించుకున్నాయి. మరి ఈ రెండు నెలల పాటు ఎవరి ప్రయాణం ఎలా కొనసాగిందో చూద్దాం.

అంచనాలు లేకుండా అగ్రస్థానానికి - టోర్నీ మొదలు అవ్వకముందు కోల్‌కతా టాప్‌ - 4కు దూసుకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ టోర్నీలో సునీల్ నరైన్, ఫిల్‌ సాల్ట్‌, ఆండ్రి రస్సెల్ విధ్వంసం, బౌలింగ్‌లో కుర్రాళ్లు వైభవ్‌ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్‌ చక్రవర్తి వంటి వారు రాణించడం వల్ల కోల్​కతా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 9 విజయాలు నమోదు చేసింది. 20 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. రెండు మ్యాచులు మాత్రం వర్షం కారణంగా రద్దయ్యాయి.

ఊహించని విధంగా ప్రదర్శన - గత సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన సన్​రైజర్స్​ ఈ సారి మాత్రం అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేసి ప్లేఆఫ్స్‌కు చేరింది. ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్స్​, క్లాసెన్‌ హిట్టింగ్‌, నితీశ్‌రెడ్డి ఆల్‌రౌండ్‌ ఇన్నింగ్స్‌, అబ్దుల్ ఫినిషింగ్‌ వల్ల 14 మ్యాచుల్లో 8 విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్‌ రద్దు వల్ల 17 పాయింట్లను దక్కించుకుంది. అలానే ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు (287) సాధించిన జట్టుగానూ రికార్డుకెక్కింది.

తొలి 9 మ్యాచుల్లో ఎనిమిది విజయాలు - ఎప్పుడూ వరుసగా మూడు, నాలుగు మ్యాచులు గెలిచి ఢీలా పడిపోయే రాజస్థాన్ ఈ సారి ఏకంగా మొదటి తొమ్మిది మ్యాచుల్లో 8 విజయాలు సాధించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా మళ్లీ ఆఖరి ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో పరాజయం అందుకుంది. ఒక మ్యాచ్‌ రద్దైంది. ఫస్ట్ హాఫ్​లో ఆధిపత్యం చూపించిన ఆ జట్టులో బ్యాటర్లు, బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.

ఫస్టాప్ తుస్సు మనిపించి సెకంఢాప్​లో దూసుకొచ్చి - ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ కీలకమైన చెన్నై మ్యాచ్‌లో మంచి ప్రదర్శ చేసి టాప్ 4కు చేరుకుంది. వాస్తవానికి ఫస్టాప్​లో పేలవ ప్రదర్శన చేసింది బెంగళూరు చట్టు. కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్​, డీకే తప్ప మిగిలిన వారు నిరాశపరిచారు. బౌలర్లు తుస్సుమనిపించారు. కానీ సెకండాఫ్​లో విల్ జాక్స్‌, రజత్‌ పాటిదార్‌ రాణించి జట్టు ముందుకు దూసుకెళ్లేలా చేశారు. దీంతో వరుసగా ఆరు విజయాలు సాధించి జట్టు 4వ స్థానానికి వచ్చేలా చేశారు. బౌలింగ్‌ కూడా పుంజుకుంది.

షెడ్యూల్ ఇదే -

  • మే 21న అహ్మదాబాద్​లో కోల్‌కతా వర్సెస్​ హైదరాబాద్‌ క్వాలిఫయర్‌ -1 జరగనుంది.
  • మే 22న అహ్మదాబాద్​లో బెంగళూరు - రాజస్థాన్‌ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నారు.
  • మే 24న మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన టీమ్​ - ఎలిమినేటర్‌ విజేత జట్టు మధ్య మ్యాచ్​
  • మే 26 న క్వాలిఫయర్‌ - 1 విజేత - క్వాలిఫయర్‌ - 2 విజేత మధ్య తుది పోరు జరగనుంది.

5ఏళ్ల తర్వాత సన్​రైజర్స్ అలా- అంతా కమిన్స్ వల్లే! - IPL 2024

ఉత్కంఠ పోరులో సీఎస్కేకు షాక్​ - ప్లే ఆఫ్స్​కు ఆర్సీబీ - IPL 2024 CSK VS RCB

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.