IPL 2024 Play offs CSK VS RCB : ఐపీఎల్ 2024లో దాదాపుగా లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటికే మూడు టీమ్‌లు ప్లేఆఫ్స్‌కు చేరాయి. చివరి ప్లేఆఫ్స్ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(CSK), బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) పోటీ పడుతున్నాయి. రేపు శనివారం మే 18న రెండు జట్లు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే బెంగళూరులో జరుగనున్న ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇటీవల సన్‌రైజర్స్, గుజరాత్ మ్యాచ్ వర్షం కారణంగా రద్ధవడంతో హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు వెళ్లిన అయిన సంగతి తెలిసిందే. శనివారం కూడా ఇలానే జరిగితే ఆర్సీబీ ఆశలపై వరణుడు నీళ్లు చల్లినట్లు అవుతుంది.
అందుకే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే చెన్నైతో మ్యాచ్ జరగడం బెంగళూరుకు అత్యంత కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే చెన్నై నాకౌట్‌కు వెళ్లిపోతుంది. అందుకే మ్యాచ్ సక్రమంగా జరగాలని, కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరగాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
- చిన్నస్వామిలో అడ్వాన్స్‌డ్ సిస్టమ్
వర్షం పడి ఆగిన తర్వాత గ్రౌండ్‌ను రెడీ చేసేందుకు చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక వసతులు ఉన్నాయి. 2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా అహ్మదాబాద్‌లో వర్షం పడ్డాక పిచ్‌ను సిద్ధం చేయడంలో ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఇక్కడ అత్యాధునికమైన సబ్‌ఎయిర్ సిస్టమ్ అందుబాటులో ఉంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ దాదాపు పదేళ్ల నుంచి సబ్ ఎయిర్ సిస్టమ్‌ను వినియోగిస్తోంది. పిచ్‌తోపాటు, మైదానంలోని పచ్చిక కింద మల్టిపుల్ లేయర్స్‌లో ఇసుకను వాడారు. బెంగళూరులో ఇసుక ఉండటం వల్ల నీరు గ్రౌండ్‌లో ఉండకుండా మెషిన్ స్టార్ట్ చేయగానే బయటకు వచ్చేస్తుంది. 200 హార్స్‌పవర్ మెషిన్‌లతో సబ్‌ఎయిర్ సిస్టమ్ రన్ అవుతుంది. నీటిని డ్రైనేజ్‌ల ద్వారా బయటకు పంపిస్తారు. ఆ తర్వాత డ్రయర్స్, రోప్స్‌తో గ్రౌండ్‌ను రెడీ చేసేస్తారు.
ఓ మోస్తరు వాన పడి, ఆగితే 15 నిమిషాల్లోనే గ్రౌండ్‌ను రెడీ చేసేయచ్చు. ఈ విధానంలో ఒక్క నిమిషంలోనే దాదాపు 10 వేల లీటర్ల నీటిని పీల్చేస్తుంది. ఒకవేళ గంటలపాటు భారీ వర్షం పడి ఆగితే 30 లేదా 40 నిమిషాల్లో మ్యాచ్‌ను నిర్వహించుకునేలా మైదానాన్ని రెడీ చేయవచ్చు. ఈ సిస్టమ్ కోసం అప్పట్లోనే దాదాపు రూ.83 కోట్లు(10 నుంచి 12 మిలియన్ డాలర్లు) కర్ణాటక బోర్డు ఖర్చు చేసింది.
- వాన అప్పటికీ ఆగకపోతే?
శనివారం రాత్రి ఒకవేళ ఊహించినట్లు వర్షం కురిస్తే 10.30 గంటల్లోపు వర్షం ఆగిపోవాలి. అప్పుడే మ్యాచ్ ప్రారంభమవుతుంది. అప్పటికీ వాన ఆగకపోతే మ్యాచ్‌ను క్యాన్సిల్ చేస్తారు. రెండు టీమ్‌లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. చెన్నై నాకౌట్‌కు చేరుకుంటుంది బెంగళూరు ఎలిమినేట్ అవుతుంది.
-
Royal Challenge Packaged Drinking Water Moment of the Day 📸
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 17, 2024
A little step here, a little step there,
Match day excitement is already in the air 🙌#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Choosebold pic.twitter.com/aXWxX9HqjN
-
'కోహ్లీ, రోహిత్‌ను తీసుకొని తప్పు చేశారు' - T20 World CUP 2024
ఆర్సీబీ గెలిచినా సీఎస్కేకే ప్లే ఆఫ్స్ అవకాశం - ఎలాగంటే? - IPL 2024 CSK VS RCB