ETV Bharat / sports

పంజాబ్​తో మ్యాచ్​ - అది నన్ను ఎంతో బాధించింది : కోహ్లీ - IPL 2024 PBKS VS RCB - IPL 2024 PBKS VS RCB

IPL 2024 PBKS VS RCB Kohli : పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో ఆ విషయం తనను ఎంతో బాధించిందని చెప్పాడు కోహ్లీ. ఇంతకీ ఏం జరిగిందంటే?

పంజాబ్​తో మ్యాచ్​ - అది నన్ను ఎంతో బాధించింది : కోహ్లీ

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 9:45 AM IST

Updated : Mar 26, 2024, 11:22 AM IST

IPL 2024 PBKS VS RCB Kohli : ఐపీఎల్ 2024లో భాగంగా బెంగళూరు వేదికగా తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్లు తేడాతో గెలుపొందింది. ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ (49 బంతుల్లో 11×4, 2×6 సాయంతో 77 పరుగులు) చెలరేగి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ మరో ఎండ్‌లో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (10 బంతుల్లో 3×4, 2×6 సాయంతో 28 నాటౌట్‌), లొమ్రార్‌ (8 బంతుల్లో 2×4, 1×6 సాయంతో 17 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు.

అయితే మ్యాచ్ విజయం తర్వాత కోహ్లీ మాట్లాడాడు. అందరూ రికార్డులు, గణాంకాలు గురించి మాట్లాడుతుంటారని, కానీ వాటి కన్నా జ్ణాపకాలే ముఖ్యమని చెప్పుకొచ్చాడు కోహ్లీ. మ్యాచ్‌‌ను తాను ముగించలేకపోవడం ఎంతో బాధినిచ్చిందని అన్నాడు. "ఎక్కువ ఎక్సైట్ అవ్వొద్దు.ఇప్పటివరకు జరిగింది రెండు మ్యాచులే. ఎంత కష్టపడితే ఆరెంజ్ క్యాప్ వస్తుందో నాకు తెలుసు. ఆట గరించి ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటారు. అందరూ విజయాలు, గణాంకాల గురించి మాట్లాడుకుంటారు. కానీ చివరికి మిగిలేవి జ్నాపకాలే. ద్రవిడ్ ఈ విషయాన్నే చెబుతుంటారు. టీ 20ల్లో నేను ఓపెనర్​గా వస్తుంటాను. టీం గెలుపునకు ప్రయత్నిస్తుంటాను. వికెట్లు పడుతున్నాయంటే అభిమానులు పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఇది సాధారణ ఫ్లాట్ పిచ్ కాదు. నేనే గేమ్‌ను ముగించలేకపోవడం కాస్త నిరాశ పరిచింది. దాదాపు 2 నెలల తర్వాత క్రికెట్ ఆడినప్పటికీ బాగానే రాణించాను. నేను కవర్ డ్రైవన్​ను బాగా ఆడతానని బౌలర్లకు బాగా తెలుసు కాబట్టే దానికి తగ్గట్లుగా బౌలింగ్ వేస్తుంటారు. ప్లాన్​కు తగ్గట్లుగా ఆడాల్సి ఉంటుంది. టీ20ఆటను ప్రమోట్ చేయడానికే నా పేరును తరచూగా వాడుకుంటారని నాకు బాగా తెలుసు. టీ20 క్రికెట్లో ఇప్పుడూ కూడా అదే జరుగుతోంద"ని అని కోహ్లీ అన్నాడు. భవిష్యత్తులో జరగబోయే టీ20 టోర్నీల్లోనూ తానే హీరోనంటూ చెప్పకనే చెప్పాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేస్తే ఆర్సీబీ టీం 19.2 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి తొలి మ్యాచుతో బోణీ కొట్టింది.

కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రెండు రికార్డ్​లు - తొలి టీమ్​ఇండియా ప్లేయర్​గా - IPL 2024 Punjab Kings VS RCB

కింగ్ దంచేశాడు - విజయం బెంగళూరుదే - RCB Vs PBKS IPL 2024

Last Updated : Mar 26, 2024, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.