ETV Bharat / sports

కావ్య పాప ఫుల్ ఖుషీ - ఈ భూమి మీద ఇంకెవరూ ఇంత అందంగా, ఆనందంగా ఉండరేమో! - IPL 2024 MI VS Sunrisers - IPL 2024 MI VS SUNRISERS

IPL 2024 Mumabi Indians VS Sunrisers Kavya Maran : ఉప్పల్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్​పై సన్​రైజర్స్​ సాధించిన అద్వితీయ విజయాన్ని సాధించింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ పట్టలేని సంతోషంతో సంబరాల్లో మునిగితేలింది. అలానే ఆ జట్టు యజమాని కావ్య కూడా ఫుల్ ఖుషీ అయిపోయింది. స్టేడియంలో ఆమె తమ జట్టు బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే ఎగిరి గంతులేస్తూ మరీ తన ఆనందాన్ని వ్యక్త పరిచింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. మీరు చూశారా?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 9:15 AM IST

IPL 2024 Mumabi Indians VS Sunrisers Kavya Maran : ఐపీఎల్ 2024లో భాగంగా ఉప్పల్​ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ భారీ విజయాన్ని సాధించింది. అటు ఐపీఎల్ చరిత్రలో ఇటు హౌం గ్రౌండ్​లో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఏకంగా 277 పరుగుల భారీ స్కార్ చేసింది. దీంతో ఆర్మెంజ్ ఆర్మీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అభిమానులు కాలర్ ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. స్టేడియం అంతా సన్​రైజర్స్​ పేరుతో మార్మోగిపోయింది. సోషల్ మీడియా వేదికగా కూడా ఫ్యాన్స్​ రచ్చ రచ్చ చేస్తున్నారు.

అదే సమయంలో స్టేడియంలో మ్యాచ్​ను వీక్షించిన సన్ రైజర్స్ జట్టు యజమాని కావ్య సంబరపడిన దృశ్యం కూడా అందరినీ కట్టిపడేసింది. ఎందుకంటే తమ తొలి మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడినప్పటికీ ఓడిపోయింది. తమ జట్టు ఓటమితో ఆ రోజు స్టేడియంలో కావ్య ముభావంగా కనిపించింది. తమ జట్టు బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చిన సమయంలో, బ్యాటర్లు ఔట్ అయిన సందర్భంలో ఆమె చాలా మూడీగా కనిపించింది. జట్టు జెర్సీని, కెప్టెన్సీని మార్చినా కూడా ఫేట్ మాత్రం మారలేదంటూ కావ్య పాపకు నెట్టింట సైటైర్లు కూడా పడ్డాయి.

కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్​లో మాత్రం సన్​రైజర్స్ చేసిన విధ్వంసానికి కావ్య పాప ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చోలేదు. ప్రతి ఫోర్​కు, సిక్సర్​కు సీటులో నుంచి లేచి మరీ కేరింతలు, చప్పట్లు కొడుతూ మ్యాచ్​ను బాగా ఎంజాయ్ చేసింది. కొన్ని సందర్భాల్లో ఎగిరి గంతులేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. తమ జట్టు బ్యాటర్లు ఊచకోత కోస్తుంటే మరింత ఎంకరేజ్ చేస్తూ స్టాండ్స్​లో కూర్చొని రచ్చ రచ్చ చేసింది.

వాస్తవానికి సన్​రైజర్స్ ప్రదర్శనపై చాలా కాలం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆ జట్టు చాలా కీలక మ్యాచుల్లో చేతులెత్తేసింది. దీంతో చాలా కాలంగా కావ్య పాప ముఖంలో ఆనందం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు తాజాా విజయంతో చాలా కాలం తర్వాత కావ్య ముఖంలో ఆనందాన్ని చూసి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్​, ఇతర నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఒక్క మ్యాచ్ 523 పరుగులు 38 సిక్స్‌లు - ఉప్పల్​లో సన్​రైజర్స్​ రికార్డుల సునామీ! - IPL 2024 MI VS Sunrisers Hyderabad

ఉప్పల్‌ ఊగిపోయింది - ముంబయిపై సన్​రైజర్స్​ అద్భుత విజయం - MI VS SRH IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.