IPL 2024 MI VS RCB Dinesh Karthik : ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసినప్పటికీ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబయి బౌలర్ బుమ్రాతో పాటు ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ కూడా హైలెట్ అయ్యాడు. ఎందుకంటే అతడు కూడా మంచి ప్రదర్శన చేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 53 అజేయ పరుగులు చేశాడు. అలా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఆకాశ్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్‌లో అయితే ఇన్నోవేటివ్ షాట్స్ బాది ఆకట్టుకున్నాడు. నాలుగు బౌండరీలు తరలించాడు. అయితే ఈ నాలుగు బౌండరీలను కూడా థర్డ్ మ్యాన్ రిజీయన్‌లోనే రావడం విశేషం.
రోహిత్ శర్మ టీజింగ్ - ఇకపోతే ఈ మ్యాచులో దినేశ్ కార్తీక్‌ను ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అటపట్టించడం కూడా సోషల్ మీడియాలో హైలైట్ అయింది. జస్‌ప్రీత్ బుమ్రా(5/21) ఓ వైపు నిప్పులు చెరుగుతున్నా తన హిట్టింగ్‌తో ఆర్సీబీకి భారీ స్కోర్ అందించాడు దినేశ్ కార్తీక్. బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో ఆర్సీబీ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి సమయంలోనూ ఆఖరి బంతిని దినేశ్ కార్తీక్ సిక్సర్‌గా మలిచాడు. అప్పుడు వెంటనే కార్తీక్ దగ్గరకు వచ్చిన రోహిత్ శర్మ అతడిని మెచ్చుకుంటూ సరదాగా టీజ్ చేశాడు. ఆ సమయంలో హిట్ మ్యాన్ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. శెభాష్ రా కార్తీక్ ప్రపంచకప్ ఆడేందుకే కదా ఇలా రెచ్చిపోతున్నావ్ అంటూ టీజ్ చేశాడు. కామెంటేటర్లు కూడా టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులో చోటు కోసం కార్తీక్ పోటీ పడుతున్నట్లు అన్నాడు.
కాగా, ఈ సీజన్లో దినేశ్ కార్తీక్ ప్రదర్శన పర్వాలేదనిపించేలా సాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో అతడు చేసిన స్కోర్ ఈ విధంగా ఉన్నాయి.
- 38*(26) vs సీఎస్కే
- 28*(10) vs పంబాజ్ కింగ్స్
- 20(8) vs కోల్‌కతా నైట్ రైడర్స్
- 4(8) vs లఖ్‌నవూ
- 53*(23) vs ముంబయి ఇండియన్స్
బెంగళూరు చిత్తు - హై స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబయి విజయం - MI vs RCB IPL 2024
ఆర్సీబీపై విజయం - బుమ్రా ఖాతాలోకి పలు రికార్డులు - IPL 2024 RCB VS Mumbai Indians