ETV Bharat / sports

కేఎల్ రాహుల్ - సంజీవ్ గోయెంకా గొడవపై స్పందించిన కోచ్​ - ఏమన్నారంటే? - IPL 2024

IPL 2024 KL Rahul Sanjiv Goenka Argument : లఖ్​నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఏల్​ రాహుల్​ను ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా నలుగురు ముందే విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు ఎల్​ఎస్​జీ అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్.

The Associated Press
KL Rahul (The Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 8:58 AM IST

IPL 2024 KL Rahul Sanjiv Goenka Argument : లఖ్​నవూ సూపర్ జెయంట్స్ జట్టు క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. అయితే అది మ్యాచ్ రిజల్ట్ వల్ల కాదు. ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకాకు, జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మధ్య ఇటీవలే జరిగిన గొడవ వల్ల. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అందరూ దీన్ని తప్పు పడుతున్నారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు ఎల్​ఎస్​జీ అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్.

"ఇద్దరు క్రికెట్ లవర్స్ మధ్య జరిగిన చర్చలో నాకెటువంటి సమస్య ఉన్నట్లుగా కనిపించలేదు. అదొక టీ కప్పులో తుఫాను వంటిది. ఇలాంటి డిస్కషన్లు జరుగుతుండాలి. అలా జరిగితేనే టీమ్ బెటర్​గా పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇదంత పెద్ద విషయమమేమీ కాదు" అని తాజాగా జరిగిన ఇంటర్ల్యూలో చెప్పుకొచ్చాడు.

"కేఎల్ రాహుల్ తనకున్న ప్రత్యేక స్టైల్‌తోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఈ ఐపీఎల్ మాత్రం అతనికి చాలా కష్టంగా మారింది. కెప్టెన్‌గానూ అటు జట్టు వికెట్లు కోల్పోతుండటం తలనొప్పిగా మారింది. బ్యాటింగ్ విభాగం లఖ్​నవూ జట్టును క్లిష్ట పరిస్థితుల్లో పడేసింది. కీలకమైన సమయాల్లోనే వికెట్లు నిలబెట్టుకోలేకపోయింది" అని తెలిపాడు.

అసలేం జరిగిందంటే ? - రీసెంట్​ సన్‌రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. హైదరాబాద్​ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు ధాటిగా ఆడి 9.4 ఓవర్లలోనే లఖ్​నవూ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించేశారు. దీంతో తమ జట్టు కనబరిచిన ప్రదర్శనపై ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా విసుగెత్తిపోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్​తో మీడియాతో పాటు స్టేడియంలో అభిమానులు చూస్తుండగానే తిట్టిపోశాడు. దీంతో సగం సగం ఇన్ఫర్మేషన్‌తో ఇంటర్నెట్‌లో వచ్చే ఏడాది రాహుల్‌ను లఖ్​నవూ జట్టు అంటిపెట్టుకోదని, అదే డిస్కషన్ జరిగిందని ప్రచారం సాగింది.

Lucknow Super Giants Points Table : కాగా, ఐపీఎల్ 2024లో 12 లీగ్ మ్యాచ్‌లు ఆడిన లఖ్​నవూ 6 మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆడినా ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. లఖ్​నవూ తన తర్వాతి మ్యాచ్ లను మే14న దిల్లీ క్యాపిటల్స్​తో, మే17న ముంబయి ఇండియన్స్​తో ఆడనుంది.

'కెమెరాల మధ్య అలా చేయడమేంటి?- అది జరగాల్సింది నాలుగు గదుల లోపల' - KL Rahul Sanjiv Goenka

కేఎల్ రాహుల్‌పై విరుచుకుపడ్డ లఖ్​నవూ యజమాని! - వైరల్​ వీడియో చూశారా? - IPL 2024 LSG

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.