ETV Bharat / sports

ఇండియాకు తిరిగొచ్చిన అనుష్క శర్మ, అకాయ్‌ - Kohli Son - KOHLI SON

IPL 2024 Kohli Son : సాధారణంగా సెలబ్రిటీ కపుల్స్‌ అప్‌డేట్స్‌పై ఫ్యాన్స్‌ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా విరాట్‌, అనుష్క కుమారుడు అకాయ్‌ గురించి తెలుసుకోవాలి, అతడిని చూడాలని చాలా మంది క్రికెట్ ప్రియులకు ఉంటుంది. అయితే అకాయ్ పుట్టినప్పటి నుంచి లండన్​లో ఉన్న అనుష్క శర్మ తాజాగా తన కొడుకును తీసుకుని ఇండియాకు తిరిగొచ్చింది.

ఇండియాకు తిరిగొచ్చిన అనుష్క శర్మ, అకాయ్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 9:29 PM IST

Updated : Apr 16, 2024, 10:16 PM IST

IPL 2024 Kohli Son : సెలబ్రిటీ కపుల్స్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్టార్‌ కపుల్‌ ప్రతి అప్‌డేట్‌ గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. 2024 ఫిబ్రవరిలో విరుష్క జంటకు లండన్‌లో కుమారుడు అకాయ్‌ జన్మించిన సంగతి తెలిసిందే. అయితే కొడుకు పుట్టిన తర్వాత లండన్‌లోనే గడిపిన అనుష్క శర్మ, మంగళవారం భారతదేశానికి తిరిగి వచ్చింది.

పిల్లల ప్రైవసీకి ప్రాధాన్యం - అలానే ఎయిర్‌పోర్ట్‌లో ఫొటోలు తీయడానికి ప్రయత్నించిన ఫొటోగ్రాఫర్లకు ఆమె ఓ రిక్వెస్ట్‌ కూడా చేసింది. తన కొడుకు ఫోటోగ్రాఫర్‌లకు అకాయ్‌ను చూపించి, పిల్లలను ఫొటోలు తీయవద్దని అభ్యర్థించింది. కొడుకు అకాయ్, కుమార్తె వామిక లేకుండా తాను ఫొటోలకు పోజులిస్తానని చెప్పింది.

కాగా, 2018లో వామిక పుట్టినప్పటి నుంచి అనుష్క తన పిల్లల ప్రైవసీని కాపాడుతోంది. ఆమె సోషల్ మీడియాలో వారి ఫొటోలు షేర్‌ చేసినప్పటికీ ఎమోజీలతో ముఖం కవర్‌ చేస్తుంది. కొడుకు ఆకాయ్ విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 15న అకాయ్ పుట్టిన తర్వాత అనుష్క, విరాట్ కలిసి కూడా తమ పిల్లల ప్రైవసీకి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని ఈ జంట కోరింది. అందుకే ఇప్పుడు ఎయిర్‌పోర్టులో కూడా ఫొటోలు తీయవద్దని అనుష్క కోరింది.

సిరీస్‌కి దూరమైన కోహ్లీ - అలానే అనుష్క డెలివరీ కారణంగానే ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు అందుబాటులో లేని కోహ్లీ అకాయ్‌ జన్మించిన కొద్ది రోజులకు భారతదేశానికి తిరిగి వచ్చాడు. 'DAD' అని రాసున్న క్యూట్‌ కార్టూన్‌ క్యారక్టెర్‌ ఉన్న వైట్ టీ షర్ట్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తే బిజీగా గడుపుతున్నాడు. ఆర్సీబీ సరైన ప్రదర్శన చేయలేకపోయినా విరాట్(IPL 2024 Kohli Performance) మాత్రం అదరగొడుతున్నాడు. ఇక అనుష్క విషయానికొస్తే, ఇండియా ఉమెన్‌ క్రికెటర్‌ జులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చక్దా ఎక్స్‌ప్రెస్‌లో కనిపించనుంది.

అప్పుడే జూనియర్ కోహ్లీ 'అకాయ్' రికార్డ్​ - పాకిస్థాన్‌లో ఫ్యాన్స్​ సంబరాలు!

అకాయ్‌ : కోహ్లీ - అనుష్క కొడుకు పేరుకు అర్థమేంటో తెలుసా?

Last Updated : Apr 16, 2024, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.