IPL 2024 KKR VS CSK : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగబోయే మ్యాచుకు (ఏప్రిల్ 8) ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే వేర్వేరు కారణాల వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీశ పతిరణ తిరిగి అందుబాటులోకి రానున్నారు. ఇవాళ జరగబోయే మ్యాచ్‌లో వీరు ఆడే అవకాశం ఉందని తెలిసింది. టీ20 ప్రపంచకప్ కోసం వీసా తీసుకోవాలని స్వదేశానికి (బంగ్లాదేశ్) వెళ్లిన ముస్తాఫిజుర్ చెన్నైకు బయల్దేరాడని సమాచారం అందింది. అలానే గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పతిరణ కూడా ప్రస్తుతానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని తెలిసింది. బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ ఈ విషయాన్ని తెలిపాడు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరు అందుబాటులోకి రాకపోయిన కూడా అందుకు తగ్గట్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సీఎస్కే చేసుకుంది.
కాగా, ముస్తాఫిజుర్, పతిరణ లేని లోటు చెన్నై జట్టులో క్లారిటీగా కనిపించిందనే చెప్పాలి. ఈ ఇద్దరి గైర్హాజరీ అవ్వడంతో సీఎస్కే జట్టు బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోయిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ముస్తాఫిజుర్, పతిరణ స్థానాల్లో వచ్చిన విదేశీ ప్లేయర్లు మొయిన్, తీక్షణ రాణించినప్పటికీ లోకల్ పేసర్లైన ముకేశ్ చౌదరీ, తుషార్ దేశ్‌పాండే మరీ దారుణంగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి నేడు(ఏప్రిల్ 8) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగబోయే నేటి మ్యాచ్‌లో సీఎస్కే వీరిద్దరిని నమ్ముకుని బరిలోకి దిగే సాహసం చేయదని చాలా మంది అనుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుత సీజన్లో ముస్తాఫిజుర్ 3 మ్యాచుల్లో 7 వికెట్లు తీశాడు. పతిరణ 2 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టి ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి వీరిద్దరు ఈ రోజు జరగబోయే మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తే చెన్నై జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే కోల్‌కతా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. సీఎస్కే నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, రెండు ఓటములను ఎదుర్కొంది. ఇక కోల్‌కతా తమ చివరి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించగా, సీఎస్కే సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోయింది. కాగా, కేకేఆర్ - చెన్నై మ్యాచ్ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ముంబయి విజయం - 18 వేల మంది చిన్నారులతో నీతా అంబానీ సందడి - IPL 2024 DC VS Mumbai Indians
దానికి కట్టుబడి ఉన్నా - అందుకే ఈ విజయం : మ్యాచ్ హీరో యశ్ ఠాకూర్ - IPL 2024 Gujarat Titans VS LSG