ETV Bharat / sports

'అంబటి రాయుడు ఓ జోకర్‌' - IPL 2024 Ambati Rayudu

IPL 2024 Ambati Rayudu : ఐపీఎల్‌ 2024 ఫైనల్లో కేకేఆర్‌ గెలిచిన సంగతి తెలిసిందే. సన్‌ రైజర్స్‌ సపోర్టర్స్‌ బాధపడితే, కేకేఆర్‌ ఫ్యాన్స్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు తాను చేసిన ఓ పనితో జోకర్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే?

Getty Images
Ambati Rayudu (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 8:29 PM IST

IPL 2024 Ambati Rayudu : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఏదో ఒక టీమ్‌కు మాజీ క్రికెట్ ప్లేయర్స్‌, మూవీ స్టార్స్‌ సపోర్ట్‌ చేస్తుంటారు. కొందరు మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియానికి కూడా వస్తుంటారు. ఇదంతా కామనే అయినా, నిన్న మే 26న చెన్నైలో ఐపీఎల్ ఫైనల్‌ ముగిసిన తర్వాత అంబటి రాయుడు చేసిన ఓ పనికి జోకర్‌ అనిపించుకున్నాడు. ఇంతకీ రాయుడు ఏం చేశాడంటే?

ఐపీఎల్ ఫైనల్లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ మ్యాచ్‌ స్టార్ట్‌ కాక ముందు టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు సన్‌ రైజర్స్‌కు సపోర్ట్ చేశాడు. ఆరెంజ్‌ ఆర్మీకి సపోర్ట్‌గా ఆరెంజ్‌ వెయిస్ట్‌కోట్‌ ధరించి కనిపించాడు. అయితే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గెలిచిన వెంటనే ఆరెంజ్‌ కలర్‌ కోటు తీసేసి, బ్లూ కలర్‌ కోటు వేసుకున్నాడు. ఇది గమనించిన కామెంటేటర్స్‌ కెవిన్ పీటర్సన్, మాథ్యూ హేడెన్ అంబటి రాయుడును ఆటపట్టించారు. పోస్ట్‌ మ్యాచ్‌ షోలో పీటర్‌సన్, హేడెన్ ఇద్దరూ రాయుడిని 'జోకర్' అని పిలిచారు.

  • రెండు టీమ్‌లకు సపోర్ట్‌ చేస్తున్నానన్న రాయుడు
    హోస్ట్ మాయంతి లాంగర్ మాట్లాడుతూ - ‘అంబటి రాయుడు ఆరెంజ్‌ నుంచి బ్లూ లోకి మారాడనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు’ అని చెప్పింది. పీటర్సన్ తన పర్పుల్‌ డ్రెస్‌ను చూపిస్తూ - ‘నేను కనీసం ఒక్కదానిపై బలంగా ఉన్నాను. నేను నాకు నచ్చింది, నా సొంతమైంది ధరించాను. నువ్వు జోకర్, ఎప్పుడూ జోకర్’ అని రాయుడుని ఉద్దేశించి అన్నాడు. ఇందుకు రాయుడు స్పందిస్తూ - ‘నేను రెండు జట్లకు సపోర్ట్ చేస్తున్నాను. మంచి క్రికెట్‌కు నేను సపోర్ట్ చేస్తున్నాను’ అని చెప్పాడు.
  • మొదటి నుంచి కేకేఆర్‌ వైపే విజయం
    ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అతి తక్కువ పరుగులు చేసిన టీమ్‌గా సన్‌రైజర్స్‌ నిలిచింది. ముందు టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఫస్ట్ బ్యాటింగ్‌ ఎంచుకుంది.18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్‌ అయింది. కోల్‌కతా బౌలర్స్‌లో రస్సెల్‌ 3, స్టార్క్‌ 2, హర్షిత్‌ రాణా 2 వికెట్లతో హైదరాబాద్‌ని కోలుకోలేని దెబ్బ కొట్టారు. 114 తక్కువ టార్గెట్‌తో ఛేజింగ్‌కి దిగిన కేకేఆర్‌ 10.3 ఓవర్స్‌లోనే మ్యాచ్‌ ఫినిష్‌ చేసి కప్పు ఎగరేసుకుపోయింది.

బలహీనతేలేని కోల్‌'కథ' - జట్టు విజయానికి కారణమిదే - IPL 2024 Winner KKR

ఐపీఎల్​, డబ్ల్యూపీఎల్​ ఫైనల్​ - ఈ ఇంట్రెస్టింగ్​ పోలికలను గమనించారా? - IPL 2024 and WPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.