IPL 2024 Gujarat Titans VS Mumbai Indians : ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయని ప్రచారం మొదలైంది. ఐపీఎల్ 2024సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో సూపర్ సండే మ్యాచులో ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఫీల్డ్ సెటప్ విషయంలోనూ పాండ్య సూచలను బుమ్రా లెక్కచేయలేదన్నట్టుగా వీడియో ఒకటి కనిపిస్తోంది. ఇందులో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఆ సమయంలో రోహిత్ ఎంటర్ అవ్వగా పాండ్య అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఫీల్డ్ మార్పులను పట్టించుకోని రోహిత్‌పై కూడా పాండ్య గట్టిగా అరిచినట్లు తెలుస్తోంది. పాండ్య అరుపులు విన్న రోహిత్ శర్మ షాక్ అయ్యాడు. చేసేదేం లేక అక్కడి నుంచి ఫీల్డ్ పొజషన్కు వెళ్లాడు. ఈ వీడియో కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. సాధారణంగా ఇప్పటివరకు రోహిత్ శర్మ ఫీల్డర్లపై ఎక్కువగా అరుస్తుంటాడు. ఫిల్డింగ్ విషయంలో అలసత్వం వహించిన ఆటగాళ్లను రోహిత్ శర్మ గతంలో మందలించిన వీడియోలు చాలా వరకు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అలాంటిది తాజా వీడియో చూసిన ఫ్యాన్స్ ఎలా ఉండే రోహిత్ ఎలా అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రోహిత్ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడూ పాపం రోహిత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పాండ్య వ్యూహాలపై మాజీలు ఆశ్చర్యం : ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి - గుజరాత్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హార్దిక్ పాండ్య తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత బౌలర్లను వినియోగించుకున్నతీరుపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్, కెవిన్ పీటర్సర్ ఒక్కింత అసహనం వ్యక్తం చేశారు. బుమ్రా బదులు పాండ్య తొలి ఓవర్ వేడయం సరికాదన్నారు. తొలి ఓవర్ స్టార్ పేసర్ బుమ్రా కాకుండా కెప్టెన్ హార్దిక్ పాండ్య వేశాడు. 8 బంతుల్లోనే గుజరాత్ ఓపెనర్లు 19 పరుగులు చేశారు.
దీంతో ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్ వేదికగా బుమ్రా ఎక్కడ?అంటూ పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. పాండ్య బ్యాటింగ్ ఆర్డ్ పైనా పఠాన్ విమర్శించారు. రషీద్ ఖాన్ బౌలింగ్‌ను తప్పించుకోవడానికి టీమ్ డేవిడ్‌ను ముందు పంపిండాన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యానించాడు. అలాగే రోహిత్ శర్మ, బుమ్రాపై పాండ్య ప్రవర్తించిన తీరును చాలా మంది తప్పుబడుతున్నారు.
-
Mumbai Indians team is no more #ONEFAMILY
— Satya Prakash (@Satya_Prakash08) March 24, 2024
This team has completely broken.
Nothing looking good Between Hardik Pandya, Rohit Sharma and Jasprit Bumrah in this. pic.twitter.com/BslDBSo8cs
స్టేడియంలో దారుణంగా కొట్టుకున్న రోహిత్ - హార్దిక్ ఫ్యాన్స్ - వీడియో వైరల్ - IPL 2024 MI VS GT
'అదే మా ఓటమికి కారణం - తిలక్ నిర్ణయమే సరైనది' : హార్దిక్ పాండ్య - IPL 2024 MI VS GT