IPL 2024 Mumbai Indians VS Gujarat Titans : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ - 17లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. అయితే గత రెండు సీజన్లలో గుజరాత్‌ను ఫైనల్ చేర్చడంతో పాటు 2022లో ఆ జట్టుకు టైటిల్ కూడా అందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్య. కానీ ఈ సారి అతడు ముంబయి ఇండియన్స్‌కు సారథ్యం వహిస్తుండడం విశేషం. మరోవైపు రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం పట్ల ఫ్యాన్స్‌లోనే కాదు జట్టు సభ్యుల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో అందరి దృష్టీ హార్దిక్‌పైనే ఉంది. సహచరులను అతడు ఎలా సమన్వయం చేసుకుంటాడు, ముంబయి జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో అని. అలానే కెప్టెన్సీ కోల్పోయిన హిట్‌మ్యాన్ బ్యాటర్‌గా ఎలా రాణిస్తాడన్నది ప్రస్తుతం ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది.
అయితే ముంబయి జట్టుకు హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మలతో పాటు బుమ్రా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ కూడా కీలకం కానున్నారు. మరోవైపు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ బరిలోకి దిగనుంది. కెప్టెన్ శుభమన్ గిల్‌తో పాటు విలియమ్సన్, మిల్లర్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్‌లే ఈ జట్టుకు అతి పెద్ద బలం.
-
In my 10th IPL season, grateful for the journey, for the growth, for everything that's come my way 🙏 And to be back with a team that's always been in my heart 💙 pic.twitter.com/vNnT6XVefH
— hardik pandya (@hardikpandya7) March 22, 2024
IPL 2024 Rajasthan Royals VS Lucknow Super Giants : ఇకపోతే శనివారం మరో మ్యాచ్ కూడా జరగనుంది. మధ్యాహ్నం జరిగే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నూవ సూపర్ జెయింట్స్ - సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. లఖ్‌నవూ జట్టుకు మేయర్స్, డికాక్, కృణాల్, పూరన్ కీలకంగా వ్యవహరించనున్నారు. కృనాల్ పాండ్య, కైల్ మేయర్స్, స్టాయినిస్ వంటి స్టార్ ఆల్‌రౌండర్లతో పాటు డేవిడ్ విల్లీ, యశ్ ఠాకూర్, నవీనుల్ హక్, బిష్ణోయ్, శివమ్ మావి, మోసిన్‌లతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. రాజస్థాన్‌లో యశస్వి, బట్లర్, బౌల్ట్, చాహల్ కీలకంగా వ్యవహరించనున్నారు. నిలకడలేని ప్రదర్శన చేస్తున్న సంజు శాంసన్ ఎలా రాణిస్తాడో ఆసక్తికరం. చూడాలి మరి ఈ రెండు మ్యాచుల్లో ఎవరు రాణిస్తారో, ఎవరు గెలుస్తారో?
గబ్బర్ జట్టు ఘన విజయం - రెండో మ్యాచ్‌లో పంజాబ్‌దే విక్టరీ! - PBKS VS DC IPL 2024
ఉత్కంఠ పోరుతో సన్‌రైజర్స్‌పై కోల్‌కతా విజయం - KKR VS SRH IPL 2024