ETV Bharat / sports

కేకేఆర్‌ సక్సెస్‌లో ఆ ఇద్దరే కీలకం - జట్టు కోసం ఏం చేశారంటే? - IPL 2024 winner KKR - IPL 2024 WINNER KKR

ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే కేకేఆర్‌ సక్సెస్‌లో టీమ్‌ మెంబర్స్‌తో పాటు మెంటార్‌ గంభీర్, కో-ఓనర్ షారుక్‌ పాత్రపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ వారు టీమ్‌ కోసం ఏం చేశారంటే? Source The Associated Press

Source The Associated Press and ANI
sharukh gambhir (Source The Associated Press and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 9:24 PM IST

IPL 2024 KKR : ఐపీఎల్‌ 2024 మొత్తం హోరా హోరీగా సాగింది. చాలా మ్యాచుల్లో చివరి బాల్ వరకు విజేతలు ఎవరో తేలలేదు. ఇక మే 26న ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను సులువుగా ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. లీగ్‌ స్టేజులో నిలకడా రాణించిన కేకేఆర్‌ ఫైనల్లోనూ ఆకట్టుకుంది.

అయితే ఐపీఎల్‌లో ఇంత నిలకడగా ఆడి కప్పు గెలిచిన జట్లు అరుదుగా కనిపిస్తాయి. ఈ విజయంలో ప్లేయర్స్‌ పాత్ర ఎంత ప్రధానమో, తెర వెనక వ్యక్తులు కూడా అంతే కీలకం. కేకేఆర్‌ విజయం అనంతరం మెంటార్‌ గౌతమ్ గంభీర్, కో-ఓనర్‌ షారుక్‌ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వాళ్లు ప్లేయర్స్‌కు ఇచ్చిన సపోర్ట్‌ని అందరూ అభినందిస్తున్నారు.

వాళ్లతో పోలిస్తే గంభీర్‌ ప్రత్యేకం(KKR Mentor Gambhir) - చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు ఐపీఎల్‌ టీమ్‌లకు మెంటార్‌లుగా వ్యవహరించారు. ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ గౌతమ్ గంభీర్ అద్భుత ఫలితాలు అందుకున్నాడు. గత రెండేళ్లు లఖ్‌నవూ మెంటార్‌గా సక్సెస్‌ అయ్యాడు. రెండు సీజన్లలో ఆ జట్టు ప్లేఆఫ్స్‌ ఆడింది. ఈ సీజన్లో కేకేఆర్‌ మెంటార్‌గా బాధ్యతలు అందుకున్నాడు. టీమ్‌ను సమష్టిగా నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ప్లేయర్స్‌ స్వేచ్ఛగా, నేచురల్‌ గేమ్‌ ఆడేలా చూసుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా లాంటి యంగ్‌ ప్లేయర్స్‌కు ప్రోత్సహించాడు. ప్రతి సందర్భంలోనూ గంభీర్‌ ఆటగాళ్లకు సపోర్ట్‌గా నిలిచాడు. కోల్‌కతాకు కోచ్ చంద్రకాంత్ పండిట్ అయినా, గంభీర్ అన్నీ తానై వ్యవహరించాడు.

కేకేఆర్‌ విజయంలో షారుక్‌ పాత్ర ఏంటి?(KKR Mentor Sharukh Khan) - ఓనర్‌గా షారుక్‌ ఖాన్, కేకేఆర్‌ విజయంలో ఎలా కీలకమయ్యాడు? అనే సందేహం రావచ్చు. ఏం చేయకపోవడమే షారుక్‌ చేసిన గొప్ప పని. లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో లఖ్‌నవూ 166 పరుగులు చేస్తే, హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలోనే గెలిచేసింది. ఈ మ్యాచ్ అయ్యాక లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా, అందరి మధ్యనే కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా చాలా మంది షారుక్‌ ఖాన్‌ గురించి ప్రస్తావించారు. ఎందుకంటే షారుక్‌ మ్యాచ్‌ విజయాల్లో జోక్యం చేసుకోడు. స్టేడియంకు వచ్చి మ్యాచ్‌ చూస్తాడు, ప్లేయర్స్‌ ఆడుతున్నప్పుడు వాళ్లలో ఉత్సాహం నింపుతాడు, గెలిస్తే సంతోషం వ్యక్తం చేస్తాడు, ఓడితే ఓదార్చి వెళ్లిపోతాడు.

షారుక్‌ గురించి గంభీర్‌ - ఇటీవల చాలా సందర్భాల్లో గంభీర్‌ షారుక్‌ గురించి గొప్పగా చెప్పాడు. తాను చాలా ఏళ్లపాటు కేకేఆర్‌ కెప్టెన్‌గా ఉన్నా పది నిమిషాలు కూడా షారుక్‌ తనతో క్రికెట్ గురించి మాట్లాడలేదని చెప్పాడు. దీనిపై ఓ యూట్యూబ్ ఛానెల్లో షారుక్‌ మాట్లాడుతూ ‘నాకు యాక్టింగ్‌ ఎలా చేయాలో ఎవరైనా చెప్తే కోపం వస్తుంది. అలాగే నాకు పెద్దగా అవగాహన లేని క్రికెట్లో ప్రొఫెషనల్ ప్లేయర్స్‌కు సలహాలు ఇవ్వకూడదని భావిస్తాను.’ అని చెప్పాడు. ఎంత బిజీ షెడ్యూల్ అయినా, షారుక్‌ కేకేఆర్‌ మ్యాచ్‌లకు ఆటగాళ్లను ఎంకరేజ్‌ చేస్తుంటాడు. కేకేఆర్‌ ప్లేయర్స్‌ శ్రమ, గంభీర్‌, షారుక్‌ ఖాన్‌ ప్రోత్సాహంతో ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా సక్సెస్‌ఫుల్‌ అయిందని క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌, ఫ్యాన్స్‌ చెబుతున్నారు.

బలహీనతేలేని కోల్‌'కథ' - జట్టు విజయానికి కారణమిదే - IPL 2024 Winner KKR

'అయ్యర్' ది విన్నింగ్ కెప్టెన్- ట్రోఫీతో ఫుల్ సెలబ్రేషన్స్- రోహిత్ రికార్డు సమం - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.