IPL 2024 Eliminator Match RR VS RCB: 2024 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19 ఓవర్లలో ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (45 పరుగులు), రియాన్ పరాగ్ (36 పరుగులు) రాణించారు. ఆఖర్లో షిమ్రన్ హెట్మెయర్ (26 పరుగులు), రోవ్‌మన్ పావెల్ (16 పరుగులు) రాజస్థాన్ విజయం కట్టబెట్టారు. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2, లాకీ ఫెర్గ్యూసన్, కరన్ శర్మ, కామెరూన్ తలో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో రాజస్థాన్ జైస్వాల్, కాడ్మోర్ (20 పరుగులు) మంచి ఆరంభాన్నిచ్చారు. కాడ్మోర్, 5.3 వద్ద ఫెర్గ్యూసన్‌కు చిక్కాడు. కానీ, ఆ తర్వాత కూడా జెస్వాల్ దూకుడుగానే ఆడాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (17 పరుగులు) ఆకట్టుకోలేకపోయాడు. ఇక మిడిల్లో రియాన్ పరాగ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ధ్రువ్ జురెల్ (8) రనౌట్‌తో మ్యాచ్ కాస్త ఆసక్తిగా మారినా, ఆ తర్వాత వచ్చిన హెట్మెయర్ దూకుడుగా ఆడాడు. చివర్లో హెట్మెయర్ ఔటైనా, పావెల్ (16*) 19 ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో మ్యాచ్ ముగించేశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లకు 172-8 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (22 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు) టాప్ స్కోరర్. విరాట్ కోహ్లీ (24 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 33 పరుగులు), డుప్లెసిస్ (14 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 17), కామెరూన్ గ్రీన్ (21 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 27) పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక కీలక మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) మరోసారి డకౌట్ అయ్యాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, చాహల్, సందీప్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.
'T20ల్లోంచి విరాట్‌ను తప్పించడమే వాళ్ల పని!' - T20 World Cup
కోహ్లీ భద్రతకు ముప్పు- స్టేడియం వద్ద ఉగ్రవాదులు అరెస్ట్- RCB ప్రాక్టీస్ క్యాన్సిల్! - IPL 2024