IPL 2024 DC VS CSK Dhoni Wife Sakshi : విశాఖ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే తొలి ఓటమి చవి చూసింది. మ్యాచ్ ఓడినా సీఎస్‌కే అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్‌కు సంబరపడిపోతున్నారు. ఎన్నో రోజుల తర్వాత వింటేజ్ ధోనీని ఫ్యాన్స్ చూశారు. ధోనీతో పాటు రోడ్డు ప్రమాదానికి గురై దాదాపు 15 నెలలు ఆటకు దూరమైన పంత్ కూడా ఈమ్యాచ్‌తో ట్రాక్‌లోకి ఎక్కాడు. ఈ నేపథ్యంలో మహీ సతీమణి సాక్షి సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు.
ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు అందుకున్న ధోనీ ఫొటోను పోస్ట్ చేసిన సాక్షి ముందుగా రిషభ్ పంత్‌కు స్వాగతం అని చెప్పింది. మ్యాచ్‌ను ఓడిపోయామని ధోనీకి ఇంకా తెలియదనుకుంటా అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఓటమి బాధ లేకుండా ధోనీ అవార్డు తీసుకోవడంతో సాక్షి ఇలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఇక పంత్ విషయానికి వస్తే ధోనీ ఫ్యామిలీకి పంత్ అత్యంత దగ్గర సన్నిహితుడు. ఖాళీ సమయాల్లో ధోనీ కుటుంబంతో పంత్ సమయాన్ని గడుపుతుంటాడు కూడా.
ఓటమి గురించి కెప్టెన్ రుతురాజ్ ఏమన్నాడంటే? - మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్ పిచ్‌లో మార్పు తమకు స్పష్టంగా కనిపించిందని తెలిపాడు. మొదటిగా దిల్లీ బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉన్న పిచ్ తమ ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి సీమ్ అయిందన్నాడు. పవర్ ప్లే తర్వాత తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని, ప్రత్యర్థి జట్టును ఆ పిచ్ పై 190 పరుగులకు కట్టడి చేయడం బౌలర్ల అద్భుత ప్రదర్శన అన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సీమ్ మూవ్‌మెంట్ కనిపించిందని, ఈ ఎక్స్‌ట్రా బౌన్స్, మూవ్‌మెంట్ వల్లే రచిన్ రవీంద్ర సులభంగా ఔటయ్యాడని పేర్కొన్నాడు. 191 స్కోర్‌ను చూసి తాము విజయం సాధిస్తామని ఆశించినట్లు తెలిపాడు. కానీ పవర్ ప్లేలోనే దారుణంగా విఫలమవ్వటంతో లక్ష్యచేధనలో వెనకబడ్డామన్నాడు. రెండు విజయాల తర్వాత ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు.
ధోనీ దంచుడే దంచుడు - 8వ స్ధానంలో వచ్చి సిక్సర్ల వర్షం! - IPL 2024 DC VS CSK
వైజాగ్ మ్యాచ్ - సీఎస్కేపై దిల్లీ క్యాపిటల్స్ విజయం - IPL 2024 CSK VS DC