IPL 2024 CSK Deepak Chahar Injury : చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. తమ జట్టు స్టార్ పేసర్ అయిన దీపక్ చాహర్ మరోసారి మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి వెళ్లిపోయాడు. చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ అందుకున్న చాహర్ తన రెండో డెలివరీలోనే కాస్త ఇబ్బందికి లోనయ్యాడు. తొడకండరాల గాయం వల్ల తాను ఇబ్బంది పడుతున్న విషయాన్ని వెంటనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు తెలియజేసి మైదానం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అన్‌కంప్లీటెడ్‌గా వదిలేసిన ఓవర్‌ను శార్దూల్ ఠాకూర్ ఫినిష్ చేశాడు.
కాగా, దీపక్ చాహర్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం ఇది రెండోసారి. ప్రస్తుత సీజన్‌లోనే ముంబయితో జరిగిన మ్యాచ్ లోనూ గాయం కారణంగానే తప్పుకున్నాడు చాహర్. దీంతో అతడు ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఐపీఎల్ 2022వ సీజన్లోనూ గాయాలు అతడిని వేధించడంతో సీజన్ మధ్యలోనే ఇంటి బాట పట్టాడు.
అయితే చాహర్ గాయంపై కెప్టెన్ గైక్వాడ్ స్పందించాడు. "అతను బౌలింగ్ వేసే సమయంలోనే చాలా ఇబ్బందికి గురవుతున్నట్లుగా అనిపించింది. కాలి కండరాల సమస్యతో బాధపడుతున్నట్లు నాతో చెప్పాడు. చాహల్ తన తొలి ఓవర్లోనే వెళ్లిపోవడం. ఇతర ఆటగాళ్లకు కూడా గాయమవ్వడం మాకు కాస్త సమస్య అయింది. అదే మాకు ప్రధాన సమస్య." అని వెల్లడించాడు.
ఆవేశపడకండి - దీపక్ చాహర్ మరోసారి గాయంతో మైదానం వీడటంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ ట్రోలింగ్‌పై అతడి సోదరి మాలతీ తీవ్రంగా ఖండించింది, కచ్చితంగా అంతకుమించిన ఫిట్నెస్తో చాహర్ బౌన్స్ బ్యాక్ అవుతాడంటూ ట్వీట్ చేసింది. "అంత ఆవేశపడిపోకండి. ఈ గాయాలు కావాలని ఎవరూ కోరుకోరు. తన బెస్ట్ ఇవ్వడం కోసమే అతను ట్రై చేస్తాడు. స్ట్రాంగ్‌గా మళ్లీ తిరిగొస్తాడు" అని సోదరుడికి తన మద్దతు తెలియజేసింది.
ఇదే సమస్యతో - చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలంకకు చెందిన మతీశ్ పతిరానా కూడా ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందే హ్యామ్‌స్ట్రింగ్ నొప్పి కారణంగా సీజన్‌కు దూరమయ్యాడు. ప్రస్తుత సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మిచెల్ మార్ష్ సైతం ఇదే సమస్యతో బాధపడుతూ సీజన్‌కు దూరమయ్యాడు.
-
Third away win of the season for #PBKS as they ease past #CSK by 7 wickets 👏
— IndianPremierLeague (@IPL) May 1, 2024
The comprehensive win keeps their hopes alive for a spot in the 🔝4️⃣
Scorecard ▶️ https://t.co/EOUzgkMFN8 #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/OUIEajRVgO