Ins Vs Eng 1st Test Rahul Dravid: ఇంగ్లాండ్‌తో సొంత గడ్డపై ఓటమి తర్వాత టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ అదనంగా 70 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు. ఆ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు (జైశ్వాల్, రాహుల్, జడేజా) 80+ స్కోర్లను శతకాలుగా మార్చడంలో విఫలమయ్యారని అన్నాడు. ఇక యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పేలవ ప్రదర్శనపై కూడా రాహుల్ మాట్లాడాడు.
'యంగ్ ప్లేయర్లను అంత తొందరగా జడ్జ్ చేయలేను. మా కుర్రాళ్లు టాలెంటెడ్. ఆ పిచ్‌పై 230 పరుగులు ఛేదించడం అంత సులువేమీ కాదు. ఉప్పల్ గ్రౌండ్ ఛాలెంజింగ్ పిచ్. ఆ పిచ్‌ను అర్థం చేసుకోవడం పెద్ద టాస్క్. వాళ్లు (యంగ్ ప్లేయర్లు) డొమెస్టిక్ టోర్నీల్లో అనేక మ్యాచ్‌లు ఆడి, ఇక్కడిదాకా (టీమ్ఇండియా జట్టుకు) వచ్చారు. వాళ్లు ఇంతా మెరుగయ్యేందుకు సమయం పట్టవచ్చు. వాళ్లు నెట్స్‌లో కూడా చాలా కష్టపడతారు' అన్నాడు.
Shubman Gill Test Stats: అయితే శుభ్‌మన్ గిల్ కొన్ని రోజులుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. రీసెంట్గా ముగిసిన సౌతాఫ్రికా పర్యటన సహా చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో గిల్ ఒక్కసారి 50+ స్కోర్ చేయలేదు. అతడు చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 0, 23, 10, 36, 26, 2, 29*, 10, 6, 18 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్టు కెరీర్లో 39 మ్యాచ్‌ల్లో 1063 పరుగులు చేశాడు. కాగా, అతడి టెస్టు సగటు 29.53కి పడిపోయింది.
మ్యాచ్ విషయానికొస్తే: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరులో భారత్ డీలా పడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెరీర్లో తొలి టెస్టు ఆడిన ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ 7 వికెట్లతో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య విశాఖప్టటణం వేదికగా ఫిబ్రవరి 02- 06 రెండో మ్యాచ్ జరగనుంది.
-
Rahul Dravid said, "we'll have to counter Bazball. It's important that we respond. We need to come up with some plans and strategies". pic.twitter.com/BUeNWzIll4
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rahul Dravid said, "we'll have to counter Bazball. It's important that we respond. We need to come up with some plans and strategies". pic.twitter.com/BUeNWzIll4
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 28, 2024Rahul Dravid said, "we'll have to counter Bazball. It's important that we respond. We need to come up with some plans and strategies". pic.twitter.com/BUeNWzIll4
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 28, 2024
టీమ్ఇండియాకు షాక్- రెండో టెస్ట్‌కు ఆ స్టార్ ప్లేయర్ దూరం!
ఉప్పల్ టెస్ట్‌లో భారత్ ఓటమి - 7 వికెట్లతో చెలరేగిన ఇంగ్లాండ్ స్పిన్నర్