IND Vs PAK ICC Championship Trophy : వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండో పాక్ మ్యాచ్‌కు పాకిస్థాన్‌లోని లాహోర్ ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సమ్మతించినట్లు ఐసీసీకి చెందిన ఓ సీనియర్ మెంబర్ తాజాగా వెల్లడించారు. అయితే తాత్కాలిక షెడ్యూల్‌కు బీసీసీఐ ఇంకా ఓకే చెప్పలేదని అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలోనీ 15 మ్యాచ్‌లకు గానూ పాక్ బోర్డు ఓ రఫ్ ప్రణాలికను నివేదించిందని తెలిపారు. అందులో లాహోర్‌లో ఏడు, కరాచీలో మూడు, అలాగే రావల్పిండిలో ఐదు మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రతిపాదించారని పేర్కొన్నారు.
"ఓపెనింగ్‌తో పాటు రెండు సెమీఫైనల్స్ మ్యాచ్‌లు కరాచీ, రావల్పిండిలో జరుగుతుంది. ఫైనల్ మాత్రం లాహోర్‌లో జరుగుతుంది. ఇండియాకు సంబంధించిన అన్నీ మ్యాచ్‌లు కూడా లాహోర్‌లోనే జరుగుతాయి" అని ఐసీసీ సీనియర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇక పాకిస్థాన్ చివరగా 1996 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌నకు ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత 2009 ఛాంపియన్స్ ట్రోపీ, 2011 వరల్డ్ కప్ నిర్వహించే ఛాన్స్ వచ్చింది. కానీ 2009లో లాహోర్‌లో శ్రీలంక ప్లేయర్లపై ఉగ్రదడి జరగడం వల్ల భద్రతా కారణాల రీత్యా ఆ రెండు ఈవెంట్లను అక్కడి నుంచి తరలించారు. చివరిసారిగా 2012-2013లో టీమ్ ఇండియా పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ భారత్‌లో పర్యటించింది. కానీ ఆ తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇరు దేశాల మధ్య సరిహద్దు, ఇతర సమస్యల కారణంగా రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి. గతేడాది పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్‌ను కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించారు. ఎందుకంటే టీమ్ఇండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరించడంతో ఇలా చేశారు.
అయితే ఈ మెగా టోర్నీ కోసం వేదికను మార్చడం లేదా గత ఆసియాకప్ స్టైల్లోనే హైబ్రిడ్ మోడల్‌ను ఏర్పాటు చేయడంపై చర్చలు జరుగుతున్నాయని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అలానే సమీప భవిష్యత్‌లో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం కష్టమేనని పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లోనే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ- భారత్ రియాక్షన్‌పై ఉత్కంఠ!
పాకిస్థాన్‌కు షాక్!- ఐస్లాండ్లో ఛాంపియన్స్ ట్రోఫీ- ఇదంతా భారత్ పనేనా!