Jugraj Singh Hockey India: భారత్ హాకీ యువ కెరటం జుగ్‌రాజ్ సింగ్ జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఒకానొక దశలో అట్టారీ సరిహద్దుల్లో సందర్శకులకు జాతీయ పతాకాలను అమ్మేవాడు. అంతలా కష్టపడ్డాడు. ఈ క్రమంలో ఎందరో యువకులకు స్ఫూర్తిగా నిలిచి, ఆసియా కప్‌లో భారత్‌కు విజయాన్ని అందించిన జుగ్ పాల్ సింగ్ వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేద్దాం పదండి.
దేశం, కుటుంబాన్ని తన రెక్కల కష్టంతో ఆదుకున్నాడు జుగ్‌రాజ్ సింగ్. పూట గడవడమే కష్టమైన కుటుంబంలో పుట్టిన జుగ్ పాల్, ఫ్యామీలో కోసం రాత్రివరకు పనిచేశాడు. అదే సమయంలో జాతీయ క్రీడ హాకీలో మువ్వన్నెల పతాకం మురిసేలా ఆడాడు. అతడు ఎదిగిన తీరు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
కాగా, ఇటీవల చైనాలో జరిగిన ఆసియాకప్ ఫైనల్స్‌లో ఆతిథ్య జట్టును 1-0తో ఓడించి విజేతగా నిలవడంలో జుగ్‌రాజ్ కీలక పాత్ర పోషించాడు. చివరి నిమిషంలో చేసిన మెరుపు గోల్ ఇండియా గెలుపులో కీలకమైంది. క్రీడాకారుడిగా ఎదిగే క్రమంలో తన కుమారుడు జుగ్ పాల్ ఎంత శ్రమించాడో ఆయన తండ్రి సుఖ్‌జీత్ సింగ్ ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు.
'గర్వంగా అనిపిస్తుంది'
భారత హాకీ యువకెరటం జుగ్‌రాజ్ తండ్రి సుఖ్‌జీత్ సింగ్ ఓ పోర్టర్. అతడి ఒక్కడి సంపాదనతో కుటుంబం గడవం కష్టమయ్యేది. దీంతో జుగ్‌రాజ్ కూడా కుటుంబ ఖర్చుల కోసం పలు రకాల పనులు చేయాల్సి వచ్చింది. ' కష్టపడి పనిచేయడం తప్ప నాకింకేమీ తెలియదు. కానీ, నా కుమారుడు జుగ్ పాల్ మొత్తం కుటుంబం గర్వపడేలా చేశాడు. అతడు అట్టారీ సరిహద్దు వద్ద బీటీంగ్ రీట్రీట్ వేడుకల్లో భారత జాతీయ పతాకాలను విక్రయించేవాడు. ఆ సొమ్ముతో కుటుంబానికి ఆర్థికంగా సాయపడేవాడు. ఇప్పుడు అతడు చేరుకొన్న స్థానం చూస్తే గర్వంగా అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చాడు.
'ఎన్ని కష్టాలున్నా హాకీని వీడలేదు'
ఇక కోచ్ నవ్‌జోత్ సింగ్ కూడా జుగ్‌రాజ్ క్రమశిక్షణ గురించి వెల్లడించాడు. తనకు ఎన్ని ఆర్థిక కష్టాలున్నా జుగ్ పాల్ హాకీని మాత్రం వీడలేదని వివరించాడు. అతడు సీనియర్ సెకండరీ స్కూల్ నుంచి ఈ గేమ్ ఆడటం మొదలుపెట్టి, కొద్ది కాలంలో అందరి దృష్టిని ఆకర్షించాడన్నాడు. జుగ్‌రాజ్‌కు ఇతర పిల్లలతో పోలిస్తే మంచి శరీరసౌష్టవం ఉందని పేర్కొన్నాడు. తండ్రితోపాటు బరువులు మోయటం వల్ల మంచి శరీరసౌష్ఠవం వచ్చి ఉండొచ్చని చెప్పుకొచ్చాడు. జుగ్‌రాజ్ రాత్రి ఎన్ని గంటల వరకు పనిచేసినా, ఉదయాన్నే మైదానానికి మాత్రం అందరికంటే ముందే వచ్చేవాడని గుర్తు చేసుకున్నాడు.
అంచెలంచెలుగా రాణించి
2009లో ఖదూర్ సాహిబ్‌లోని బాబా ఉత్తమ్ సింగ్ నేషనల్ హాకీ అకాడమీలో చేరాడు జుగ్‌రాజ్ . ఆ తర్వాత నాలుగేళ్లపాటు నెహ్రూ కప్ పోటీల్లో పాల్గొన్నాడు. 2021-22 సీజన్‌లో తొలిసారి ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో చోటు సంపాదించాడు. ఆ తర్వాత భారత్ జట్టులో స్థానం దక్కింది. తాజాగా ఆసియాకప్‌లో అద్భుతంగా రాణించి భారత్‌కు విజయాన్ని అందించాడు జుగ్‌రాజ్.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్- ఐదోసారి ట్రోఫీ కైవసం - India Wins Asian Champions Trophy
పాకిస్థాన్‌పై భారత్ గ్రాండ్ విక్టరీ- వరుసగా ఐదో విజయం - Asian Champions Trophy 2024