ETV Bharat / sports

సైనా రిటైర్మెంట్ ప్లాన్స్ రివీల్- అప్పటిలోగా నిర్ణయం! - Saina Nehwal Retirement

author img

By ETV Bharat Sports Team

Published : Sep 2, 2024, 4:35 PM IST

Saina Nehwal Retirement: భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతకం విజేత సైనా నెహ్వాల్ కెరీర్​కు ముగింపు పలికే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాల్గొన్న ఓ పాడ్​కాస్ట్​లో ఆమె రిటైర్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Saina Nehwal Retirement
Saina Nehwal Retirement (Source: Getty Images)

Saina Nehwal Retirement: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, వరల్డ్ మాజీ నెం.1 ర్యాంకర్​ 34ఏళ్ల సైనా నెహ్వాల్ తన కెరీర్​కు ముగింపు పలికే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రిటైర్మెంట్​పై సైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె ఆర్థరైటిస్​తో బాధపడుతుందట. దీంతో ఈ ఏడాది చివరి నాటికి కెరీర్ గురించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆమె వెల్లడించింది. ఈ మేరకు 'హౌస్ ఆఫ్ గ్లోరీ' పాడ్​కాస్ట్​లో తాజాగా పాల్గొన్న సైనా ఈ కామెంట్స్ చేసింది.

'నా మొకాలు బాగాలేదు. కీళ్ల నొప్పులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 8-9 గంటలు ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ప్రపంచలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీపడాలంటే 2 గంటల ప్రాక్టీస్ సరిపోదు. అందుకే నేను దాని (రిటైర్మెంట్) గురించి ఆలోచిస్తున్నా. అది కాస్త బాధగానే ఉంటుంది. కానీ, క్రీడాకారుడి కెరీర్​ చాలా తక్కువ సమయమే కదా. నేను 9ఏళ్ల వయసున్నప్పుడు కెరీర్ ప్రారంభించా. నెక్ట్స్ ఇయర్​కు నాకు 35ఏళ్లు వస్తాయి. ఈ సుదీర్ఘ కాలంపాటు నేను బ్యాడ్మింటన్​ ఆడాను. నా కెరీర్​లో సాధించిన దానిపట్ల ఎప్పుడు గర్వంగానే ఉంటా. ఈ ఏడాది చివరి నాటికి నా పరిస్థితిని బట్టి నిర్ణయం ఒక తీసుకుంటా' అని సైనా పేర్కొంది.

అది చిన్నప్పటి కల
'ఒలింపిక్స్​లో పాల్గొనడం అందరికీ చిన్ననాటి కల. దాని కోసం ఏళ్ల తరబడి కష్టపడాలి. కొన్నిసార్లు గాయాలపాలై ఆ స్థాయికి చేరుకోలేరని తెలుుసుకున్నప్పుడు ఎంతో బాధపడాల్సి వస్తుంది. కానీ, నేను ఎంతో కష్టపడ్డాను. చాలా హార్డ్ వర్క్ చేశాను. ఫలితంగా మూడు ఒలింపిక్స్​లో పాల్గొన్నా. అక్కడ 100శాతం నా బెస్ట్ ఇచ్చాను. ఒలింపిక్స్​లో నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా' అని సైనా తెలిపింది.

Saina Nehwal Career: కాగా, సైనా నెహ్వాల్ 2006లో కెరీర్ ప్రారంభించింది. డెబ్యూ చేసిన నాలుగేళ్లకే, ఆమె పద్మ శ్రీ అవార్డు అందుకుంది. తర్వాత 2012 ఒలింపిక్స్​లో కాంస్యం నెగ్గి, విశ్వక్రీడల్లో పతకం సాధించిన తొలి భారత షట్లర్​గా సైనా చరిత్ర సృష్టించింది. ఇక 2010, 2018 కామన్వెల్త్ గేమ్స్​లో స్వర్ణ పతకాలు దక్కించుకుంది. తన కెరీర్​లో ఇప్పటివరకు సైనా 21 ఇంటర్నేషనల్ టైటిళ్లు నెగ్గి వరల్డ్​ బ్యాడ్మింటన్​లో సత్తా చాటుకుంది. ఇక గాయాలతో కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న సైనా, చివరిసారిగా ఏడాది కిందట సింగపూర్ ఓపెన్​లో బరిలో దిగింది. ఈ పోటీల్లో సైనా ఓపెనింగ్ రౌండ్​లోనే ఓడింది.

'నా మాటలు లిమిట్స్ దాటాయి' - సైనా నెహ్వాల్​కు యంగ్ క్రికెటర్ క్షమాపణలు - Cricketer Apologies Saina Nehwal

Saina Nehwal Retirement : ఇప్పట్లో ఆ ఆలోచన లేదు.. నా దృష్టి అంతా దానిపైనే: సైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.