India WTC Final Scenario 2025 : 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌పై కన్నేసిన భారత్‌కు బ్యాక్ టు బ్యాక్ ఎదురుదెబ్బ తగిలింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి, పరాజయం మూటగట్టుకుంది. దీంతో 2025 డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియాపై కాస్త ప్రభావం పడింది. పట్టికలో టీమ్ఇండియా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ, పాయింట్ల పర్సెంటేజీలో తగ్గుదల వచ్చింది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియానే టాప్‌లోనే ఉంది. ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 8 విజయాలు సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి, ఒకటి డ్రాగా ముగించింది. దీంతో టీమ్‌ఇండియా ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. అయితే పాయింట్ల పర్సెంటేజీ మాత్రం 68.06 నుంచి 62.82 శాతానికి పడిపోయింది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (62.50)కు భారత్‌కు, 0.32 శాతం మాత్రమే తేడా ఉండడం గమనార్హం.
ఫైనల్ చేరాలంటే?
తాజా ఓటమితో టీమ్ఇండియా ఫైనల్ ఛాన్స్‌లు మరింత సంక్లిష్టంగా మారాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్‌కు మరో 6 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 1 మ్యాచ్ ఉండగా, ఆస్ట్రేలియా గడ్డపై 5 టెస్టులు ఆడాల్సి ఉంది. భారత్ ఇతరుల ఫలితాలపై ఆధారపడకుండా వరుసగా ముూడోసారి ఫైనల్‌కు అర్హత సాధించాలంటే 70శాతం పాయింట్ పర్సెంటేజీ ఉండాల్సిందే.
అంటే మిగిలిన ఆరింట్లో ఒక్క మ్యాచ్‌లోనూ కూడా ఓడిపోకూడదు. ఇందులో కచ్చితంగా ఐదు నెగ్గి, ఒకటి డ్రా చేసుకోవాలి. అప్పుడే టీమ్ఇండియా 70శాతానికి మించి పర్సెంటేజీ దక్కించుకోగలదు. ఈ లెక్కన బోర్డర్ గావస్కర్ ట్రోఫీని భారత్ 4-0 లేదా 5-0తో కైవసం చేసుకోవాలి. అది దాదాపు అసాధ్యమే అని విశ్లేషకుల మాట! లేదా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, మిగిలిన నాలుగు టెస్టులను డ్రా గా ముగించుకుంటే 60 శాతం పాయింట్ పర్సెంటేజీతో ఉంటుంది. అప్పుడు ఇతరుల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.
The #WTC25 race is on after New Zealand, Pakistan achieve big wins in their respective Tests.
— ICC (@ICC) October 26, 2024
Full table ➡️ https://t.co/Q822q1TYKB pic.twitter.com/LhEywM1ztd
మరోవైపు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 10 మ్యాచ్లకుగానూ ఐదింట్లో నెగ్గి, మరో ఐదు టెస్టుల్లో ఓడింది. దీంతో ప్రస్తుతం 60 పాయింట్లు, 50.00 శాతం పర్సెంటేజీతో ఉంది. కివీస్ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో నాలుగింట్లోనూ నెగ్గితేనే ఫైనల్ అవకాశాలు ఉంటాయి.
కివీస్‌తో ఓటమి WTCపై ఎఫెక్ట్- ఫైనల్ చేరాలంటే ఎన్ని నెగ్గాలంటే?
WTC టేబుల్లో కిందకి పడిపోయిన పాక్ - మరి భారత్ స్థానం ఎంతంటే?