IND W vs NZ W ODI 2024 : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 59 పరుగుల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ 40.1 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. బ్రూకీ (39 పరుగులు) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో రాధా యాదవ్ 3, సైమా ఠాకూర్ 2, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి తలో 1 వికెట్ దక్కించుకున్నారు. తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో టీమ్ఇండియా 1-0తో లీడ్‌లోకి దూసుకెళ్లింది.
స్మృతి సూపర్ త్రో
29.3 ఓవర్ వద్ద బౌలర్ సైమా వేసిన బంతిని బ్యాటర్ గేజ్ స్టైట్ డ్రైవ్ ఆడింది. బంతి నేరుగా ఫీల్డ్ అంపైర్ వైపునకు వెళ్లింది. అక్కడ 30 యార్డ్ సర్కిలో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ స్మృతి మంధాన చురుగ్గా స్పందించింది. బంతిని అందుకొని వికెట్ కీపర్ వైపు త్రో విసిరింది. అటుగా పరుగెడుతున్న గ్రీన్ క్రీజులోకి చేరుకోకముందే, ఆమె త్రో డైరెక్ట్ వికెట్లను తాకింది. దీంతో గ్రీన్ రనౌట్‌గా పెవిలియన్ బాట పట్టింది. స్మృతి విసిరిన ఈ త్రో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
W.0.0.W 😎
— BCCI Women (@BCCIWomen) October 24, 2024
An over filled with fielding brilliance 🤩
First Saima Thakor with the catch and then Captain Smriti Mandhana with a direct-hit 🔥
Live - https://t.co/VGGT7lSS13#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/dyD8tkK07K
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. తేజల్ హసబ్నిస్ (42 పరుగులు), దీప్తి శర్మ (41 పరుగులు) రాణించారు. షఫాలి వర్మ (33 పరుగులు), యస్తికా భాటియా (37 పరుగులు), జెమిమా రోడ్రిగ్స్ (35 పరుగులు) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ 4, జెస్ కెర్ 3, కార్సన్ 2, సుజీ బేట్స్ ఒక వికెట్ పడగొట్టారు.
A winning start to the ODI series in Ahmedabad 🤩#TeamIndia complete a 59 runs victory over New Zealand in the 1st #INDvNZ ODI and take a 1-0 lead 👏👏
— BCCI Women (@BCCIWomen) October 24, 2024
Scorecard - https://t.co/VGGT7lSS13@IDFCFIRSTBank pic.twitter.com/QUNOirPjbh
హర్మన్ గైర్హాజరీ
ఈ మ్యాచ్‌కు టీమ్ఇండియా మహిళల జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉంది. దీంతో యంగ్ ప్లేయర్ స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు స్వీకరించింది. కాగా, రెండో మ్యాచ్‌కు కూడా హర్మన్ ఆడడం సందేహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇరుజట్ల మధ్య అక్టోబర్ 27న రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
మహిళల టీ20 ప్రపంచ కప్ - పాక్ ఓటమి, భారత్ ఇంటికి
పాకిస్థాన్ గెలుపుపై భారత జట్టు ఆశలు! - అలా జరగకపోతే ఇక అంతే!