ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన భారత్ - ఒలింపియాడ్​లో డబుల్ స్వర్ణాలు! - Chess Olympiad 2024 - CHESS OLYMPIAD 2024

Chess Olympiad 2024 : 2024 చెస్ ఒలింపియాడ్‌లో భారత్​ చరిత్రాత్మక విజయం సాధించింది. తొలిసారి భారత్​కు స్వర్ణం దక్కింది.

Chess Olympiad 2024
Chess Olympiad 2024 (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 22, 2024, 7:00 PM IST

Chess Olympiad 2024 : 2024 చెస్ ఒలింపియాడ్‌లో భారత్​ చరిత్రాత్మక విజయం సాధించింది. 45వ ఫిడే (FIDE) పోటీల్లో భారత పురుషుల జట్టు స్వర్ణం దక్కించుకుంది. పురుషుల జట్టు స్లొవేనియాతో జరిగిన 11వ రౌండ్‌లో డి. గుకేశ్‌, అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానంద తమ తమ గేమ్‌లను గెలుపొందారు. వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్‌ ఓడించగా, జాన్ సుబెల్జ్‌పై ఇరిగేశీ, అంటన్ డెమ్చెంకోపై ప్రజ్ఞానంద విజయం సాధించారు.

అయితే టైటిల్ నేగ్గేందుకు పురుషుల జట్టు 11వ రౌండ్‌ను 'డ్రా' చేసుకున్నా సరిపోయేది. ఇప్పుడు మిగిలిన గేమ్‌లలో ఓడిపోయినా స్వర్ణం ఖాయమైంది. 45వ చెస్‌ ఒలింపియాడ్‌లో పురుషుల జట్టు తొలి ఎనిమిది రౌండ్‌లలో గెలిచి, తొమ్మిదో రౌండ్‌ను డ్రాగా ముగించింది. కీలకమైన పదో రౌండ్‌లో 2.5-1.5 తో బలమైన అమెరికాను మట్టికరిపించింది. చివరిదైన 11వ రౌండ్‌లో స్లొవేనియాపై పైచేయి సాధించింది.

మరోవైపు ఈ పోటీల్లో భారత మహిళల జట్టు కూడా తొలిసారి స్వర్ణంతో రికార్డు సృష్టించింది. 11వ రౌండ్‌లో 3.5-0.5 తో అజర్‌బైజాన్‌పై విజయం సాధించింది. డి. హారిక - దివ్య దేశ్‌ముఖ్‌ తమ తమ గేమ్‌లలో విజయం సాధించగా, ఆర్‌. వైశాలి గేమ్​ను డ్రా గా ముగించింది. అనంతరం వంతిక అగర్వాల్‌ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడం వల్ల మహిళల జట్టు విజయం ఖరారు చేసుకుంది. దీంతో భారత్‌ ఖాతాలో ఒకేసారి రెండు స్వర్ణాలు చేరాయి.

కాగా, భారత్ గతంలో 2014, 2022 రెండు ఎడిషన్​ చెస్ ఒలింపియాడ్​లోనూ కాంస్యం నెగ్గింది. కరోనా కారణంగా 2020, 2021 లో పోటీలను వర్చువల్‌గా నిర్వహించారు. 2020లో రష్యాతో కలిసి సంయుక్తంగా భారత్‌ స్వర్ణం గెలిచింది. ఇక 2021 పోటీల్లో భారత్ కాంస్యం సాధించింది. అయితే వర్చువల్‌గా జరిగిన టోర్నీల ఫలితాలను అధికారికంగా రికార్డుల్లో చేర్చలేదు. ఈసారి స్వర్ణం గెలవడం వల్ల భారత్​కు అధికారికంగా ఇదే తొలి గోల్డ్ అయ్యింది. అంతే కాకుండా ఈసారి భారత్​కు రెండు విభాగాల్లోనూ పసిడి పతకాలు రావడం కూడా విశేషం.

'నేనేదో సాధించా అనుకోను ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచిస్తా' - వరల్డ్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ విన్నర్‌ దివ్యా దేశ్‌ముఖ్‌ - Chess Player Divya Deshmukh

'ఆ ఓటమి వల్లే ఇప్పుడు గెలిచాను' : ఫిడే క్యాండిడేట్స్ విజేత గుకేశ్ - Fide Candidates 2024 winner

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.