ETV Bharat / sports

సూర్య 'సూపర్' ఓవర్ - చివరి టీ20లో భారత్ గెలుపు - India Vs Srilanka 3rd T20 - INDIA VS SRILANKA 3RD T20

India Vs Srilanka 3rd T20 : శ్రీలంకలోని పల్లెకలె వేదికగా తాజాగా జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు పెట్టిన సూపర్‌ ఓవర్​లో భారత్ గెలిచింది.

India Vs Srilanka
India Vs Srilanka (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 6:41 AM IST

India Vs Srilanka 3rd T20 : శ్రీలంకలోని పల్లెకలె వేదికగా తాజాగా జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ మాత్రమే టాప్ స్కోరర్​గా నిలవగా, రియాన్ పరాగ్‌ (26), వాషింగ్టన్​ సుందర్‌ (25) ఆదుకున్నారు.

ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన లంక జట్టు ఆదిలో ఆకట్టుకుంది. నిశాంక (26), కుశాల్‌ మెండిస్‌ (43), కుశాల్‌ పెరీరా (46) తమ ఇన్నింగ్స్​లో సత్తా చాటి మంచి స్కోర్ అందించారు. అయితే చివరి 5 ఓవర్లలో తడబడ్డ ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌ టై అయింది.

అయితే మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు పెట్టిన సూపర్‌ ఓవర్​లో లంక 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడం వల్ల ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇక సూర్య తొలి బంతికే ఫోర్‌ కొట్టడంతో ఈ మ్యాచ్​లో భారత్ గెలిచింది. వాషింగ్టన్ సుందర్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. మరోవైపు ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ శుక్రవారం ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.