India vs Pakistan Bilateral Series : భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఈ రెండు దాయాది దేశాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచ కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి గ్లోబల్ ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే రెండు జట్లు తలపడుతున్నాయి. క్రికెట్ అభిమానులు భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. రెండు దేశాల మధ్య 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు.
అయితే అన్నీ అనుకూలిస్తే త్వరలో భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు చూడవచ్చు. ఎందుకంటే ఇరు దేశాలు అంగీకరిస్తే అటువంటి సిరీస్‌కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. CA క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్, పీటర్ రోచ్ మాట్లాడారు. ఎక్సైటింగ్ మ్యాచ్‌లు అభిమానులకు అందించాలనే ఆసక్తిని హైలైట్ చేశారు. క్రికెట్‌ను ఇష్టపడే ప్రతి దేశం భారత్, పాకిస్థాన్‌లు తమ మైదానాల్లో పోటీపడడాన్ని చూడటానికి ఇష్టపడతాయని పేర్కొన్నారు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ని నిర్వహించడానికి ఉన్న ఆసక్తిని స్పష్టం చేశారు.
ఒకేసారి ఆస్ట్రేలియాలోకి ఆ రెండు టీమ్స్
ఈ నవంబర్‌లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఒకేసారి ఆస్ట్రేలియాలో ఉండే అవకాశం ఉంది. నవంబర్ 22న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. అంతకు ముందు పాకిస్థాన్‌తో మూడు వన్డే ఇంటర్నేషల్స్(ODIs), మూడు టీ20 ఇంటర్నేషనల్స్ (T20Is) ఆడుతున్నట్లు క్రికెటర్ ఆస్ట్రేలియా తన ఇంటర్నేషనల్ షెడ్యూల్ ఆవిష్కరించింది.
సిరీస్ నిర్వహించే అవకాశాలను పరిశీలించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య చర్చలు సులభతరం చేయడానికి CA సుముఖతను రోచ్ ప్రస్తావించారు. CA చీఫ్ ఎగ్జిక్యూటివ్, నిక్ హాక్లీ, రోచ్ అభిప్రాయాలతో ఏకీభవించాడు. అవకాశం వస్తే మార్క్యూ మ్యాచ్‌ను హోస్ట్ చేయడానికి ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.
2022లో టీ20 ప్రపంచ కప్ సందర్భంగా MCGలో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ సమయంలో టిక్కెట్లను నెలకొన్న డిమాండ్‌ను గుర్తు చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ హిస్టరీలో ఇటువంటి మ్యాచ్‌ల ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు. పాకిస్థాన్, భారతదేశం రెండింటికీ ఆతిథ్యం ఇవ్వడం పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఇది ద్వైపాక్షిక సిరీస్ అని, అది జరిగేలా చేయడం సంబంధిత క్రికెట్ సంస్థలపై ఆధారపడి ఉందని హాక్లీ పేర్కొన్నాడు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సిరీస్‌ను నిజం చేయడానికి చర్చలకు మద్దతు ఇవ్వడానికి, సులభతరం చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ - పొట్టి కప్ కోసం ఒక్క టికెట్ ధర రూ. 1.84 కోట్లు!
పొట్టి వరల్డ్ కప్- భారత్ X పాక్ మ్యాచ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?