India Vs New zealand Test Series : బెంగళూరు వేదికగా భారత్- న్యూజిలాండ్ పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసి అబ్బురపరిచింది. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(150), రిషభ్ పంత్(99) ఈ ఇద్దరూ రాణించడం వల్ల జట్టు ఈ భారీ స్కోర్‌ను నమోదు చేసింది.
అయితే 356 పరుగుల తేడాతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగడం వల్ల న్యూజిలాండ్ ముందు టీమ్ఇండియా 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ టార్గెట్‌ను టీమ్ఇండియా కాపాడుకుంటుందా? లేదా అన్న అనుమానాలు క్రీడాభిమానుల్లో నెలకొంది.
కానీ, తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్‌కు ఈ లక్ష్యం ఏ మాత్రం కష్టం కాదని విశ్లేషకుల మాట. అయితే టెస్ట్ ఫార్మాట్‌లో చివరి రోజు లక్ష్యాన్ని చేధించడం ఏ జట్టుకైనా కష్టమని వారి మాట. ఎందుకంటే పిచ్‌పై పగుళ్లు ఏర్పడి వికెట్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందట. అది బౌన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయట. ఈ క్రమంలోనే ఈ 107 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా కాపాడుకుంటుందని వారి అభిప్రాయం.
ఇదిలా ఉండగా, గతంలోనూ టీమ్ఇండియా స్వల్ప లక్ష్యాలను కాపాడుకొని సంచలన విజయాలు సృష్టించింది. వాంఖడే వేదికగా 2004లో ఆస్ట్రేలియాతో పోటీపడి భారత్ 107 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. ఆస్ట్రేలియాను 93 పరుగులకే ఆలౌట్ చేసి 13 పరుగుల తేడాతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
అయితే మెల్‌బోర్న్ వేదికగా 1981లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 143 పరుగులను డిఫెండ్ చేసుకుంది. ఆసీస్‌ను 83 పరుగులకే పరిమితం చేసి గెలుపొందింది. టీమిండియా స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా 107 పరుగుల లక్ష్యాన్ని చేధించడం న్యూజిలాండ్‌కు అంత సులువు కాదని చెప్పాడు. పిచ్‌పై పగుళ్లు ఏర్పడ్డాయని, ఆరంభంలోనే వికెట్లు తీస్తే విజయం సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు.
సింగిల్ రన్‌తో పంత్ సెంచరీ మిస్- 90ల్లో ఎన్నిసార్లు ఔటయ్యాడంటే?
'వద్దు బాబోయ్ వద్దు' - పంత్‌ను ఆపేందుకు సర్ఫరాజ్ ఫన్నీ స్టంట్ - నవ్వులే నవ్వులు