India Vs Bangladesh T20 World Cup : టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహాకాలు జరగుతున్న తరుణంలో బంగ్లాదేశ్‌తో తమ మెదటి వార్మప్ మ్యాచ్‌ను ఆడేందుకు భారత జట్టు సంసిద్ధమవుతోంది. ఇప్పటికే యూఎస్ చేరిన రోహిత్ సేన ఇందులో భాగంగా నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది.
అయితే ఈసారి టీమ్ఇండియా తమ వ్యూహంలో భాగంగా మొదట ఫీల్డింగ్‌పై దృష్టి సారించే పనిలో పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రాక్టీస్ సెషన్లో క్యాచ్ డ్రిల్స్‌ను చేశారట. అంతే కాకుండా ఈ పిచ్‌పై అలవాటు పడేందుకు హై క్యాచ్‌లను సైతం విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ తన వికెట్ కీపింగ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమైపోయాడు. అయితే ఈ టోర్నీ కోసం పంత్‌తో పాటు సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్లుగా ఎంపికయ్యాడు. కానీ ప్రాక్టీస్‌లో మాత్రం ఎక్కువగా పంతే కనిపిస్తున్నాడు. ఇతర బౌలర్లైన జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ కూడా బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ సూచనలతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నాడు.
ఇదిలా ఉండగా, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పలువురు దిగ్గజ బౌలర్ల బౌలింగ్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. రిజర్వ్ ప్లేయర్లుగా వచ్చిన శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ కూడా కఠిన సాధన చేస్తున్నారు. హార్దిక్
అయితే ఆ సమయంలో యంగ్ ప్లేయర్ శివమ్ దూబెతో రోహిత్ చాలాసేపు మాట్లాడాడు. ఎలాంటి లైన్ అండ్ లెంగ్త్ బంతులు సంధించాలో కూడా అతడికి సూచించాడు. దీంతో రానున్న మ్యాచ్ కోసం దూబెపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియో నెట్టంట తెగ ట్రెండ్ అవుతోంది.
మరోవైపు హార్దిక్ పాండ్య స్థానంలో దూబెకు ఛాన్స్ ఇవ్వాలని రోహిత్ అనుకుంటున్నాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తొలి మ్యాచ్ జరిగేవరకు ఈ విషయంపై క్లారిటీ రాకపోదు అన్నట్లు నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.
'ఎప్పుడూ ఇలా ఆడలేదు - మ్యాచ్‌కు ముందు కచ్చితంగా ఆ పని చేయాల్సిందే' - T20 World Cup 2024
రోహిత్, కోహ్లీకి ఇదే లాస్ట్- 11ఏళ్ల నిరీక్షణకు తెర దించుతారా? - T20 World Cup 2024