Australia Vs India Border Gavaskar Trophy : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులకు ఆలౌటవ్వగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా 252/9 స్కోరుతో నిలిచింది. ఈ క్రమంలో ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. అయినప్పటికీ ఆసీస్ కంటే 199 పరుగుల వెనుకంజలో టీమ్‌ఇండియా ఉండటం గమనార్హం.
ప్రస్తుతం క్రీజులో జస్‌ప్రీత్ బుమ్రా (10*), ఆకాశ్ దీప్ (21*) ఉన్నారు. అయితే వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఈ మ్యాచ్‌ను నిలిపేశారు. అంతకుముందు కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ముందుకు నడిపించారు. యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషభ్ పంత్ (9), సిరాజ్ (1) మాత్రం తమ సింగిల్ డిజిట్ స్కోర్‌తో జట్టును నిరాశపరిచారు. రోహిత్ శర్మ (10), నితీశ్‌కుమార్ రెడ్డి (16) పరుగులు స్కోర్ చేశారు. ఇక ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 4, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్ చెరో వికెట్ తీశారు.
టీమ్ఇండియా తుది జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
బెంచ్ : ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా.
ఆస్ట్రేలియా తుది జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుస్‌చాగ్నే, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్ బెంచ్‌బ్యూ వెబ్‌స్టర్, జోష్ ఇంగ్లిస్, బ్రెండన్ అబ్బోట్.
ఈ క్రికెటర్లు బోర్డర్ గావస్కర్తోనే టెస్ట్ కెరీర్ ముగించారు - ఎందుకంటే?
'టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ ఎవరు- అసలు వాళ్లను గైడ్ చేస్తున్నదెవరు?'