ETV Bharat / sports

4331 రోజుల తర్వాత భారత్​కు తొలి ఓటమి- చరిత్ర సృష్టించిన కివీస్ - IND VS NZ 2ND TEST 2024

12ఏళ్లలో భారత్​కు తొలి ఓటమి- చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్- ఈ మ్యాచ్​లు విశేషాలు ఇవే!

IND vs NZ 2nd Test 2024
IND vs NZ 2nd Test 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 26, 2024, 5:11 PM IST

IND vs NZ 2nd Test 2024 : స్వదేశంలో టెస్టుల్లో భారత్ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. సొంతగడ్డపై 12ఏళ్లుగా టెస్టు సిరీస్​ల్లో విజయాలతో దూసుకుపోతున్న టీమ్ఇండియాకు, న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. తాజాగా పుణె వేదికగా జరిగిన టెస్టులో భారత్​పై కివీస్ 113 పరుగుల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను న్యూజిలాండ్ 2- 0తో కైవసం చేసుకుంది. దీంతో భారత్ స్వదేశంలో 4331 రోజుల తర్వాత తొలిసారి టెస్టు సిరీస్ కోల్పోయింది. అటు భారత్​ గడ్డపై న్యూజిలాండ్ తొలిసారి టెస్టు సిరీస్​ నెగ్గి చరిత్ర సృష్టించింది.

ఈ మ్యాచ్​లో మరిన్ని విశేషాలు

  • ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో విదేశీ గడ్డపై కివీస్‌ టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి
  • భారత గడ్డపై టెస్టు సిరీస్ దక్కించుకున్న ఆరో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకంటే ముందు ఇంగ్లాండ్ (5సార్లు), వెస్టిండీస్ (5 సార్లు), ఆస్ట్రేలియా (4 సార్లు), పాకిస్థాన్ (1 సారి), సౌతాఫ్రికా (1 సారి) జట్లు భారత్​లో సిరీస్​ నెగ్గాయి
  • స్వదేశంలో భారత్ 2012- 13 (vs ఇంగ్లాడ్)​ తర్వాత టెస్టు సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి
  • ఈ మ్యాచ్​లో కివీస్ బౌలర్ మిచెల్ శాంట్నర్ 13/157 వికెట్లు దక్కించుకున్నాడు. అతడి టెస్టు కెరీర్​లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన
  • 2024 క్యాలెండర్ ఇయర్​లో భారత్​కు సొంత గడ్డపై ఇది మూడో టెస్టు ఓటమి
  • కెప్టెన్​గా రోహిత్​కు స్వదేశంలో ఇది తొలి టెస్టు సిరీస్ ఓటమి. నాలుగేళ్ల అతడి కెప్టెన్సీలో టీమ్ఇండియా 5 టెస్టు సిరీస్​లు ఆడింది
  • 2000 సంవత్సరం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడిన నాలుగో కెప్టెన్​ రోహిత్ శర్మ. ఇంతకుముందు సచిన్ తెందూల్కర్ (2000 : 0-2 vs SA), సౌరభ్ గంగూలీ (2004 : 1-2 vs SA), ఎమ్​ఎస్ ధోనీ (2012: 1-2 vs ENG) ఓడారు.

స్కోర్లు

  • న్యూజిలాండ్ : 259-10 & 255- 10
  • భారత్ : 156- 10 & 245-10

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.