2036 Olympic Games: 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను పొందడాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే యోగా, ఖోఖో, కబడ్డీ, స్క్వాష్, చెస్, క్రికెట్ వంటి 6 భారతీయ సంప్రదాయ క్రీడలను ఒలింపిక్స్‌లో చేర్చాలని ప్రతిపాదించనుంది. ఈ మేరకు 2024 పారిస్‌లో జరిగే ఒలింపింక్స్ సందర్భంగా ఈ క్రీడల ప్రాముఖ్యతను వివరించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. 2024 పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)తో 2036 హోస్టింగ్ బిడ్ గురించి కీలక చర్చలు జరగనున్నాయి.
ఈ హోస్టింగ్ బిడ్ దక్కించుకోవడానికి భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మిషన్ ఒలిపింక్ సెల్ (MOC) ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను కొత్త క్రీడామంత్రి మన్సుఖ్ మాండవియాకు తాజాగా సమర్పించింది. ఒకవేళ భారత్ 2036 హోస్టింగ్ రైట్స్ పొందినట్లైతే ఈ 6 రకాల కొత్త క్రీడలను ఒలింపిక్స్‌లో చూడవచ్చు. అలా జరిగితే ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది.
'ఒలింపిక్స్ బిడ్ దక్కించుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)తో విస్తృతంగా చర్చలు జరపడం అనేది చాలా కీలకం. అయితే ఆతిథ్య హక్కులు పొందడం అంత సులువేం కాదు. హోస్టింగ్ రైట్స్ కోసం ఖతార్, సౌదీ అరేబియా, చైనా, హంగేరి, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, కెనడా, స్పెయిన్, యూకే, పొలాండ్, మెక్సికో, టర్కీ వంటి దేశాలతో భారత్ పోటీ పడాల్సి ఉంటుంది' అని ఎమ్‌ఓసీ మెంబర్ ఒకరు చెప్పారు. అయితే వచ్చే ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే ఆతిథ్య హక్కులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే అంతర్జాతీయ ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రీడలను చేర్చాలని ప్రతిపాదించే హక్కు ఉంటుంది. ప్రతిపాదించే క్రీడలు ఆ దేశంలో బాగా ప్రసిద్ధి చెంది, మిగిలిన 5 ఖండాల్లోనూ ఆ ఆటలు ఆడాలి. ఈ క్రమంలో భారత్ హోస్టింగ్ బిడ్ విజయవంతమైతే ప్రతిపాదించిన ఈవెంట్లను 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
వెలిగిన ఒలింపిక్ 'జ్యోతి'- 100రోజుల కౌంట్ డౌన్ షురూ! - PARIS 2024 OLYMPIC FLAME
ఒలింపిక్స్ @ 100 - నది నుంచి స్టేడియంలోకి ఓపెనింగ్ ఈవెంట్! - Paris Olympics 2024