FIH Awards 2024 : ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH) 2024 సంవత్సరానికి గాను శుక్రవారం అవార్డులు ప్రదానం చేసింది. ఒమన్ వేదికగా 49వ ఎఫ్‌ఐహెచ్ స్టాచుటొరీ కాంగ్రెస్ (49th FIH Statutory Congress) ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఇందులో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ' ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యాడు. లెజెండరీ ప్లేయర్, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ 'మెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్నాడు. కాగా, వీరిద్దరూ ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం నెగ్గడంలో కీలక పాత్ర పోషించారు. ఇక తాము ఈ అవార్డులు గెలుచుకోవండ ఎంతో గౌరవప్రదంగా భాలవిస్తున్నట్లు చెప్పారు.
'ముందుగా ఈ గొప్ప గౌరవాన్ని అందించినందుకు FIHకి ధన్యవాదాలు. ఒలింపిక్స్ గెలిచి ఇంటికి వెళ్లాక, మమ్మల్ని పలకరించడానికి, స్వాగతించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం చాలా గొప్ప విషయం. ఇది చాలా చాలా ప్రత్యేకమైన అనుభూతి. నేను నా సహచరుల గురించి మాట్లాడాలి. మీరందరూ లేకుండా ఇవేవీ సాధ్యం కాదు. అన్ని స్థాయిల్లో విజయం సాధించడానికి ఎల్లప్పుడూ మాకు అవకాశాన్ని అందిస్తున్నందుకు హాకీ ఇండియాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా భార్య, కూతురు ఈరోజు ఇక్కడ ఉన్నారు. వారి ముందు ఈ అవార్డు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. దీన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!' అని ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు.
Third time’s the charm! 🏆
— Harmanpreet Singh 🇮🇳 (@13harmanpreet) November 9, 2024
Bringing home the FIH Player of the Year award yet again is a feeling like no other. Thank you to my family, teammates, coaches, and every fan who stood by me. #FIHPlayerOfTheYear #HockeyStarAwards pic.twitter.com/IMWVP31Kbc
'ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కెరీర్‌లో చివరి అవార్డు అందించినందుకు ధన్యవాదాలు. అందరికీ తెలుసు, 2024 పారిస్ ఒలింపిక్స్‌నా దేశం కోసం నేను ఆడిన చివరి టోర్నమెంట్. నేను హాకీ ఆడిన అన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసిన హాకీ ఇండియాకు రుణపడి ఉంటాను. ఈ అవార్డు పూర్తిగా నా జట్టుకు చెందుతుంది. ఎక్కువ అటాక్స్ నాకు రాకుండా చూసుకున్న డిఫెన్స్ ప్లేయర్‌లకి, నేను చేసిన మిస్టేక్స్‌ని ఎక్కువ గోల్స్ చేసి కవర్ చేసిన మిడ్‌ఫీల్డర్లు, ఫార్వర్డ్‌లకు ఈ అవార్డు అంకితం చేస్తున్నాను' మాజీ ప్లేయర్ శ్రీజేష్ అని తెలిపాడు.
Last feather in the crown, a final gift to a journey that has given me everything.
— sreejesh p r (@16Sreejesh) November 9, 2024
FIH Goalkeeper of the Year 2023-24!
Thank you, hockey family, for the endless love and support.
I wore the jersey for you, and we did it together. 🇮🇳#GoalkeeperOfTheYear#Hockey #HockeyStarsAwards pic.twitter.com/hYjfhjt5fk
2020-21, 2021-22లో కూడా భారత కెప్టెన్ 'FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' అందుకోవడం గమనార్హం. గత పారిస్ ఒలింపింక్స్‌లో హర్మన్‌ప్రీత్ అద్భుతంగా రాణించాడు. టోర్నీలో ఏకంగా 10 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో మూడోసారి అవార్డు వరించింది.
శ్రీజేష్ ఒలింపిక్స్ తర్వాత పదవీ విరమణ చేశాడు. జూనియర్ మెన్స్ హాకీ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. హాకీ ఇండియా లీగ్‌లో దిల్లీ ఎస్‌జీ పైపర్స్ జట్టుకు మెంటార్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కొత్త హాకీ ఇండియా లీగ్ (HIL)లో హర్మన్‌ప్రీత్ సూర్మ హాకీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మహిళల విభాగంలో 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా నెదర్లాండ్స్‌కు చెందిన యిబ్బీ జాన్‌సెన్, 'ఉమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్'గా చైనాకు చెందిన యే జియావో ఎంపికయ్యారు. అలానే 'రైజింగ్ స్టార్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ఉమెన్స్ విభాగంలో అర్జెంటీనాకు చెందిన జో దాజ్, మెన్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన సుఫ్యాన్ ఖాన్ గెలుచుకున్నారు.
PR శ్రీజేశ్కు భారీ నజరానా- రూ.2కోట్లు ప్రకటించిన కేరళ ప్రభుత్వం
ఒలింపిక్స్ విన్నర్స్ కంటే ఛాయ్వాలాకే ఎక్కువ క్రేజ్?- హాకీ ప్లేయర్ డిసప్పాయింట్! - Hockey India