Hockey India Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హాకీ ఇండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సోమవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-1తో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అభిషేక్ (2వ నిమిషం), సంజయ్ (17వ నిమిషం), ఉత్తమ్ సింగ్ (54వ నిమిషం), సుఖ్జీత్ (60వ నిమిషం) గోల్స్ సాధించారు. జపాన్ నుంచి కజుమస (41వ నిమిషం) ఒక్కడే ఒక గోల్ చేశాడు. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత్ భారీ విజయం నమోదు చేసింది.
తొలి నిమిషంలోనే గోల్
మ్యాచ్‌లో భారత్ తొలి నిమిషంలోనే గోల్ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చింది. సుఖ్జీత్ (1వ నిమిషం) ఫస్ట్ గోల్ సాధించాడు. తర్వాత రెండో నిమిషంలో అభిషేక్ మరో గోల్ చేసి భారత్‌ను 2-0తో ముందంజలో ఉంచాడు. దీంతో జపాన్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇక 17వ నిమిషం వద్ద పెనాల్టీ కార్నర్లో సంజయ్ మరో గోల్ కొట్టడం వల్ల భారత్ ఫస్ట్ హాఫ్‌లో 3-0తో లిడ్లోకి వెళ్లింది. ఇక సెకండ్ హాఫ్లోనూ అదే ఊపుతో భారత్ మరో రెండు గోల్స్ సాధించి జపాన్ను చిత్తుగా ఓడించింది.
Team India gets a second 𝕎 under the belt with a smashing win against Japan.
— Hockey India (@TheHockeyIndia) September 9, 2024
5 goals scored in the game, a brace from Sukhjeet and a goal each from Abhishek, Sanjay & Uttam Singh.
We face Malaysia next on 11th at 1:15 PM (IST)
Do not forget to tune in to support team India… pic.twitter.com/jNJGv7GDfM
ఇక భారత్ బుధవారం మలేసియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌తో రాబిన్ రౌండ్ ముగుస్తుంది. మొత్తం ఆరు జట్లలో టాప్-4లో ఉన్న టీమ్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో సెప్టెంబర్ 16న సెమీస్, సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
కాగా, ఇదే టోర్నమెంట్లో భారత్ ఆదివారం చైనాపై నెగ్గింది. టోర్నీలో తొలి మ్యాచ్‌లో చైనాను ఢీకొట్టిన భారత్ 3-0 తేడాతో విజయం సాధించింది. సుఖ్‌జిత్ సింగ్ (14వ నిమిషం), ఉత్తమ్ సింగ్ (27వ నిమిషం), అభిషేక్ (32వ నిమిషం) ఫీల్డ్ గోల్స్ చేసి సత్తాచాటారు. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది.
భారత్ x పాకిస్థాన్
టోర్నీలో హై వోల్టేజ్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్థాన్ గేమ్ శనివారం (సెప్టెంబర్ 14న) జరగనుంది. శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం- చైనాపై 3-0తో గ్రాండ్ విక్టరీ
హాకీ ఇండియా - శ్రీజేశ్ వారసుడు అతడేనా? - India Hockey New Goal Keeper