ETV Bharat / sports

ఇండియా బి గ్రాండ్ విక్టరీ- గిల్ జట్టుకు తప్పని ఓటమి - Duleep Trophy 2024

author img

By ETV Bharat Sports Team

Published : Sep 8, 2024, 4:41 PM IST

Updated : Sep 8, 2024, 7:29 PM IST

India A vs India B Duleep Trophy 2024: 2024 దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్​ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఇండియా ఎ తో జరిగిన మ్యాచ్​లో ఇండియా బి జట్టు విజయం సాధించింది.

India A vs India B
India A vs India B (Source: Getty Images)

India A vs India B Duleep Trophy 2024: 2024 దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్​లో ఇండియా బి విజయం సాధించింది. ఇండియా ఎ పై 76 పరుగుల తేడాతో నెగ్గింది. ఓవర్‌ నైట్ స్కోరు 150/6తో నాలుగో రోజు, ఆటను కొనసాగించిన ఇండియా బి మరో 34 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఎ 198 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (57 పరుగులు; 121 బంతుల్లో: 7x4) హాఫ్ సెంచరీతో రాణించగా, రియాన్ పరాగ్ (31 పరుగులు, 18 బంతుల్లో), ఆకాశ్ దీప్ (43; 42 బంతుల్లో 3x4, 4x6) ఆకట్టుకున్నారు. మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. ఇక ఇండియా బి జట్టులో యశ్ దయాల్ 3, ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ తలో 2, వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి చెరో 1 వికెట్ పడగొట్టారు. కాగా , తొలి ఇన్నింగ్స్​లో భారీ శతకంతో (181 పరుగులు, 373 బంతుల్లో, 16x4, 5x6) అదరగొట్టిన ముషీర్ ఖాన్ మ్యాన్ 'ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు' అందుకున్నాడు.

ఆదుకున్న ముషీర్
కాగా, తొలి ఇన్నింగ్స్​లో ఇండియ బి జట్టు 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ జట్టును ఆదుకున్నాడు. భారీ ఇన్నింగ్స్​లో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో ఇండియా బి 321 పరుగులు చేసింది. ఇక ఇండియా ఎ లో ఆకాశ్ దీప్ 4 వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్​లో ఇండియా ఎ 231 పరుగులకు ఆలౌటైంది. టీమ్​లో ఎవరు కూడా హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు.

విఫలమైన గిల్, యశస్వి
ఇండియా ఎ కెప్టెన్ శుభ్​మన్ గిల్ ఈ మ్యాచ్​లో పెద్దగా ఆకట్టుకోలేదు. రెండు ఇన్నింగ్స్​లలో వరుసగా (25 పరుగులు, 21 పరుగులు) స్వల్ప స్కోర్లకే పెవిలియన్​కు చేరాడు. మరోవైపు ఇండియా బి ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ కూడా రాణించలేదు. తొలి ఇన్నింగ్స్​లో 30 పరుగులతో కాస్త ఫర్వాలేదనిపించినా, కీలకమైన రెండో ఇన్నింగ్స్​లో 9 పరుగులుకే ఔటయ్యాడు.

సంక్షిప్త స్కోర్లు

  • IND- B : 321-10 & 184 - 10
  • IND- A : 231-10 & 198-10

దులీప్ ట్రోఫీలో ఇండియా C బోణీ- 7 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్ - Duleep Trophy 2024

దులీప్ ట్రోఫీకి మన స్టార్లు రెడీ- లైవ్ మ్యాచ్​ ఎక్కడ చూడాలో తెలుసా? - Duleep Trophy 2024

Last Updated : Sep 8, 2024, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.