ETV Bharat / sports

రెండో వన్డేలోనూ అదుర్స్​ - హర్మన్ సేన ఖాతాలో మరో విక్టరీ - IND W Vs SA W 2nd ODI

IND W Vs SA W 2nd ODI : బెంగళూరులో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా మహిళలు అదరగొట్టారు. కివీస్​ మహిళల జట్టుపై 4 పరుగుల తేడాతో గెలుపొందారు.

IND W Vs SA W ODI
IND W Vs SA W ODI (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 8:55 PM IST

Updated : Jun 19, 2024, 9:38 PM IST

IND W Vs SA W 2nd ODI : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా మహిళలు అదరగొట్టారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో కివీస్​ మహిళల జట్టుపై 4 పరుగుల తేడాతో విజయం సాధించారు.

మ్యాచ్​ సాగిందిలా :

తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 325 పరుగులు భారీ స్కోర్​ను నమోదు చేసింది. స్మృతి మంధాన (136) సెన్సేషనల్ సెంచరీతో జట్టుకు మంచి స్కోర్​ అందించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(103*) కూడా శతకం బాది అదరగొట్టింది. ఇక రిచా ఘోష్(25 *) కూడా తన ఇన్నింగ్స్​లో మెరుపులు మెరిపించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎమ్‌లాబా రెండు వికెట్లు, క్లాస్ ఓ వికెట్​ను తమ ఖాతాలో వేసుకున్నారు.

భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు మైదానంలోకి దిగిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగులు చేసింది. అయితే గెలుపునకు అతి చేరువలో వచ్చి ఓటమిని చవిచూసింది. ఇక ఆ జట్టులోని కెప్టెన్ లారా వోల్వార్డ్(135*), మరిజన్నే కాప్(114*) సెంచరీలతో రాణించినప్పటికీ గెలవలేకపోయారు.

భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్(2/54), దీప్తి శర్మ(2/56) రెండేసి వికెట్లు పడగొట్టగా, అరుంధతి రెడ్డి(1/62), స్మృతి మంధానా(1/13) చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

భారత మహిళల తుది జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రియా పునియా, సైకా ఇషాక్, ఉమా ఛెత్రీ.

సౌతాఫ్రికా మహిళల తుది జట్టు : లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, అన్నరీ డెర్క్‌సెన్, నొండుమిసో షాంగసే, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్), మసబాటా క్లాస్, నోంకులులేకో మ్లాబా, అయాబొంగా ఖాకా, టునెమీ టిఖుక్, దెల్మీ, ఖాకా మైకే డి రిడర్, నాడిన్ డి క్లెర్క్, ఎలిజ్-మారీ మార్క్స్.

సెంచరీ రాణి స్మృతి - సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ - India Women vs South Africa Women

టీ20 వరల్డ్‌ కప్‌ మొదటి ఫైనలిస్ట్​గా భారత్‌? స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ విశ్లేషణ ఇదే! - T20 World Cup 2024

Last Updated : Jun 19, 2024, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.