ETV Bharat / sports

'గిల్ వల్లే సెంచరీ మిస్‌' - యశస్వి జైస్వాల్ ఏమన్నాడంటే? - Ind vs Zim T20 2024

Yashasvi Jaiswal T20 2024 : జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో యశస్వి జైస్వాల్​కు సెంచరీ చేయకుండా శుభ్​మన్​ గిల్ అడ్డుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై జైస్వాల్​ తాజాగా స్పందించాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

Ind vs Zim T20 2024
Shubman Gill Yashasvi Jaiswal Ind vs Zim T20 2024 (Associated Press,Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 4:11 PM IST

Ind vs Zim T20 2024 Yashasvi Jaiswal : జింబాబ్వే పర్యటలో భాగంగా జరిగిన నాలుగో టీ20లో టీమ్​ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (93) అదరగొట్టి 'ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు.

ముందు నుంచే దూకుడుగా ఆడిన జైస్వాల్ శతకం చేస్తాడని అందురూ అనుకున్నారు. కానీ ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాడు. దీంతో శుభ్‌మన్ గిల్‌ వల్లే జైస్వాల్ సెంచరీ చేయలేకపోయాడంటూ గిల్​పై కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పించారు.గిల్ దూకుడుగా ఆడి, జైస్వాల్​కు అడ్డుపడ్డాడని అంటున్నారు. అయితే, మ్యాచ్ తర్వాత జైస్వాల్ కొంతమంది అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా సెంచరీ మిస్‌ కావడం గురించి వారు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చాడు.

'గిల్ మ్యాచ్‌ను త్వరగా పూర్తి చేయడం గురించి మాత్రమే మేము ఆలోచించాం. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయం సాధించాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం. ఆ రోజు నా ఆటను ఆస్వాదించా. శుభ్‌మన్ గిల్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. మంచి స్కోరు సాధించినందుకు ఆనందంగా ఉంది. భారత్‌ కోసం ఆడటాన్ని గర్విస్తా' అని యశస్వి జైస్వాల్ పేర్కొన్నాడు.

జింబాబ్వేపై జరిగిన నాలుగో టీ20లో ఆరంభం నుంచే జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అదే ఊపులో సెంచరీ కూడా చేసేస్తాడని అందరికీ అనిపించింది. 13 ఓవర్లకు స్కోరు 128 కాగా జైస్వాల్‌ 83కు చేరుకున్నాడు. ఇంకా గెలవడానికి 25 పరుగులు అవసరం కాగా, అతడు మూడంకెల స్కోరును అందుకుంటాడనే అనిపించింది. కానీ కొంచెం ఆలస్యంగా జోరందుకున్న శుభ్‌మన్‌ దూకుడుగా ఆడి అర్ధశతకం పూర్తి చేశాడు. దీంతో జైస్వాల్‌ సెంచరీకి అవకాశం లేకుండా పోయింది.

శనివారం జరిగిన ఈ మ్యాచ్​లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే భారత్‌కు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక నామమాత్రంగా చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.

జైషా కీలక నిర్ణయం- అన్షుమాన్​కు BCCI రూ.కోటి సాయం

ఆల్​​టైమ్ ప్లేయింగ్ 11- యువీ టీమ్​లో ధోనీకి నో ప్లేస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.