Shreyas Iyer Central Contract : ఈ రోజు ఆగస్టు 2న శుక్రవారం కొలంబోలో, శ్రీలంకతో జరుగుతున్న మొదటి వన్డేలో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కింది. చాలా కాలంగా టీమ్‌లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అతడు ఎట్టకేలకు ప్లేయింగ్ 11లో చేరాడు. దీనికి ముందు అయ్యర్‌కు 2024 ఫిబ్రవరిలో రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు చివరి అంతర్జాతీయ మ్యాచ్.
- అయ్యర్, ఇషాన్ కిషన్‌పై బీసీసీఐ ఆగ్రహం
అయితే ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఫామ్ కోల్పోయిన అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. తిరిగి జట్టులోకి రావాలంటే, ఫామ్ అందుకోవాలంటే, ముంబయి తరఫున రంజీ ట్రోఫీ 2024 ఆడాలని బీసీసీఐ సూచించింది. కానీ అయ్యర్ పట్టించుకోకపోవడంతో బీసీసీఐ ఆగ్రహించింది. ఆ తర్వాత బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి శ్రేయాస్ అయ్యర్‌ను తొలగించింది. ఇదే సమయంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై కూడా వేటు పడింది.
- ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాణించిన అయ్యర్
సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఎదురుదెబ్బను అధిగమించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో రాణించాడు శ్రేయస్. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు నాయకత్వం వహించాడు. 10 సంవత్సరాల తర్వాత కేకేఆర్‌కు ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలకంగా వ్యవహరించాడు. కానీ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు అయ్యర్ ఎంపిక కాలేదు. దీంతో జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత అయ్యర్ తాజాగా జరుగుతున్న వన్డే సిరీస్‌తో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. తన ఆటను మరింత మెరుగుపడటంపై ఫోకస్ చేశాడు.
- మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ సంపాదించాలంటే ఏం చేయాలి?
2023 అక్టోబర్ 1 నుంచి 2024 సెప్టెంబర్ 30 మధ్య కనీసం మూడు టెస్టులు, ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడే ఆటగాళ్లను ప్రో-రేటా ప్రాతిపదికన గ్రేడ్ Cలో చేర్చనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
అయ్యర్ ఈ సైకిల్‌లో తన మొదటి వన్డే ఆడుతున్నాడు. అంటే ఈ సైకిల్‌లో కాంట్రాక్ట్ పొందడానికి మరో ఏడు వన్డేలు, మూడు టెస్టులు లేదా పది T20Iలు ఆడాలి. దురదృష్టవశాత్తూ, నెక్స్ట్ సైకిల్ ప్రారంభమయ్యే లోపు భారత్ మరో రెండు వన్డేలు, రెండు టెస్టులు మాత్రమే ఆడనుంది. కాబట్టి అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందడానికి మరి కొంత కాలం వేచిచూడక తప్పదు .
మ్యాచ్ మధ్యలో దూబెను తిట్టిన రోహిత్ శర్మ! - ఎందుకంటే? - IND VS SL Live Score first ODI
లైవ్ పారిస్ ఒలింపిక్స్ : సెమీస్‌లో ధీరజ్, అంకితకు నిరాశ - Paris Olympics 2024