ETV Bharat / sports

భారత్ x పాక్- హై వోల్టేజ్ మ్యాచ్​లో భారీ స్కోర్లు!- బౌండరీ లైన్ అంత దగ్గరగానా? - T20 WORLD CUP 2024 - T20 WORLD CUP 2024

Ind vs Pak T20 World Cup: 2024 టీ20వరల్డ్​కప్​లో జూన్ 9న భారత్- పాకిస్థాన్ జట్లు అమీతుమి తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్​లు న్యూయార్క్ స్టేడియం వేదికకానుంది. అయితే ఈ మైదానంలో సాధారణం కంటే తక్కువ దూరంలో బౌండరీలు ఉండనున్నాయట.

Ind Vs Pak T20 World Cup
Ind Vs Pak T20 World Cup (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 9:05 PM IST

Updated : May 4, 2024, 9:19 PM IST

Ind vs Pak T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​కు ఐసీసీ సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్​ను ప్రకటించిన ఐసీసీ, మైదానాల పనుల్లో వేగం పెంచింది. ఈ క్రమంలోనే రీసెంట్​గా న్యూయార్క్​లోని నసావు క్రికెట్ స్టేడియంలో పిచ్​ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇదే గ్రౌండ్​లో జూన్ 9న భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తలపడనుంది.

ఈ నేపధ్యంలో స్టేడియం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. సాధారణ స్టేడియాల కంటే ఈ గ్రౌండ్​లో బౌండరీ లైన్ చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. పిచ్​ నుంచి నలువైపులా 65- 70 మీటర్లకు కొంచెం అటు ఇటుగా బౌండరీ లైన్ ఉన్నట్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు భారత్​లో ఉన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కంటే ఇది తక్కువ దూరం. దీంతో ఈ హైవోల్టేజ్ మ్యాచ్​లో భారీ స్కోర్లు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ మైదానంలో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శివమ్ దూబే ఏకంగా స్పిన్నర్లపై దండయాత్ర చేస్తాడని, బంతి స్టేడియం బయట పడడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈస్టేడియంలో డ్రాప్- ఇన్ వికెట్ పిచ్​లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 10 పిచ్​లను రీసెంట్​గా ఫ్లోరిడా నుంచి న్యూయార్క్​కు 20 ట్రక్కుల ద్వారా తీసుకొచ్చారు. స్టేడియం మధ్యలో నాలుగు పిచ్​లు ఉంచనునున్నట్లు ఐసీసీ తెలిపింది. కాగా, ఈ స్టేడియం న్యూయార్క్​ ఈస్ట్​మేడ్​లోని ఐసెన్‌హోవర్ పార్క్​లో నిర్మిస్తున్నారు.

34 వేల సీటింగ్ కెపాసిటీతో, అంతర్జాతీయ మ్యాచ్​లకు అనుగుణంగా ఈ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. 2024 టీ20 వరల్డ్​కప్ టోర్నీ​లో ప్రతిష్ఠాత్మక భారత్- పాకిస్థాన్​ సమరంతో సహా మరో 8 మ్యాచ్​లకు ఈ స్టేడియం వేదికకానుంది. ఆస్ట్రేలియా ఆడిలైడ్ ఓవల్, న్యూజిలాండ్​ ఈడెన్ పార్క్ స్టేడియాల్లో మదిరి ఈ మైదానంలోనూ డ్రాప్- ఇన్​ పిచ్​ వాడుతున్నారు. ఇక జూన్ 1న పొట్టి కప్ సమరం ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో జూన్ 3న శ్రీలంక- సౌతాఫ్రికా జట్లు ఇదే వేదికగా తలపడనున్నాయి.

జెట్ స్పీడ్​లో న్యూయార్క్​ స్టేడియం పనులు- ట్రక్కుల్లో మైదానానికి చేరిన పిచ్​లు - T20 World Cup 2024

'పాకిస్థాన్ దాన్ని పాటిస్తే ఇక తిరుగుండదు!' - T20 World cup 2024 Pakisthan Team

Last Updated : May 4, 2024, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.