IND VS NZ Test Series Pant Injury Update : బెంగళూరు వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ పోరులో భారత జట్టు ప్లేయర్ రిషభ్ పంత్ (99) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్(150)తో కలిసి 177 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
అయితే న్యూజిలాండ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండగా పంత్ గాయపడ్డాడు. నొప్పిని తట్టుకోలేక మైదానం నుంచి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు నొప్పిని భరిస్తూనే రెండో ఇన్నింగ్స్‌లో అదిరే ప్రదర్శన చేశాడు. అయితే మళ్లీ ఐదో రోజు మైదానంలో పంత్ కనిపించలేదు. దీనిపై రోహిత్ మాట్లాడాడు. పంత్ ఎందుకు కనపడలేదో కారణాలను వెల్లడించాడు.
"రెండేళ్ల క్రితం పంత్‌కు జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో అతడి మోకాలికి పెద్ద సర్జరీ జరిగింది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, పునరాగమనం చేసిన అతడు అద్భుతమైన ఇన్నింగ్స్‌ల ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పుడు వికెట్ కీపింగ్ చేస్తుండగా గాయపడిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయినప్పటికీ అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంత సౌకర్యవంతంగా లేదు. వికెట్ల మధ్య పరిగెత్తలేకపోయాడు. బాల్‌ను స్టాండ్స్‌లోకి పంపడానికే ట్రై చేశాడు. పంత్ పట్ల మేం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు పంత్ జట్టును ఆదుకున్నట్టుగా, మేం కూడా అతడి పట్ల మరింత శ్రద్ధను తీసుకోవాలి. కీపింగ్ చేయడం అంత ఈజీ కాదు. సర్జరీ జరిగిన చోటే మళ్లీ బంతి తగలడం వల్ల మోకాలు వాపు వచ్చింది. పంత్ విశ్రాంతి తీసుకోవాల్సిన రెస్ట్ ఉంది. అందుకే మైదానంలోకి రాలేదు. తర్వాత జరగబోయే మ్యాచ్‌లకు పంత్ వంద శాతం ఫిట్‌గా ఉండాలని మేం అనుకుంటున్నాం." అని చెప్పుకొచ్చాడు హిట్ మ్యాన్.
పంత్ ప్రదర్శనపై మాట్లాడిన రోహిత్ - బ్యాటింగ్‌కు దిగినప్పుడు అతడి మెదడులో ఏముందో ఎవరికీ తెలీదు. అతడికి స్వేచ్ఛ ఇవ్వాలనుకున్నాం. ఎందుకంటే అతడు ఎన్నో మంచి ప్రదర్శనలు చేశాడు. అతడి మనస్తత్వం గురించి ప్రత్యేకంగా మీరు అతడితో మాట్లాడాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి ఆడే సామర్ధ్యం అతడిలో ఉంది." అని అన్నాడు.
వరల్డ్‌కప్ టైటిల్ 'న్యూజిలాండ్'దే- నయా ఛాంపియన్‌గా కివీస్
కివీస్ టెస్టు సిరీస్: BCCI కీలక నిర్ణయం- యంగ్ ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటు